మంత్రులు అధికారులు ఏం చేస్తున్నారు? : పవన్‌

Submitted by arun on Mon, 08/06/2018 - 16:22
pk

కర్నూలు జిల్లా హత్తిబెళగల్‌ క్వారీ ప్రమాద స్థలాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సందర్శించారు. పేలుళ్ల ఘటనపై స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అయితే, ఘటనస్థలిని పూర్తిగా పరిశీలించేందుకు పవన్‌కు పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో జనసేన కార్యకర్తలు దూసుకెళ్లారు. 

అక్రమ మైనింగ్ కు అడ్డుకట్ట వేసినప్పుడే హత్తిబెళగల్ క్వారీ పేలుడు వంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కర్నూలు జిల్లాలోని హత్తిబెళగల్ లోని క్వారీలో పేలుడు ప్రదేశాన్ని పవన్ కల్యాణ్ పరిశీలించారు. అ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.వివరాలు అడిగి తెలుసుకున్నారు. 

హత్తిబెళగల్ క్వారీ పేలుడు ఘటన దురదృష్టకరమన్నారు. ఉత్తరాంద్ర నుంచి రాయలసీమ వరకు అక్రమ మైనింగ్ జరుగుతోందని గనుల శాఖ మంత్రి  అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు పవన్ కల్యాణ్. కర్నూలు జిల్లాలో 1600 క్వారీలకు అనుమతులు ఇచ్చారని, 600కి పైగా అక్రమ క్వారీలు నడుస్తున్నాయని, స్థానిక యువకులు చెప్పిన సమస్యలపై త్వరలోనే స్పందిస్తానన్నారు జనసేనాని. టీడీపీ నేతలను సమర్ధిస్తున్న సీఎం చంద్రబాబు ప్రజా సమస్యలను విస్మరించవద్దన్నారు. క్వారీ పేలుడ ఘటనను పరిశీలించేందుకు కర్నూలు వచ్చిన పవన్ కల్యాణ్ కు అభిమానులు ఘనస్వాగతం పలికారు. టోల్ గేట్ నుంచి హనుమాన్ సర్కిల్ వరకు బైక్ ర్యాలీ చేపట్టారు.  

English Title
pawankalyan fires tdp govt over illigal mining

MORE FROM AUTHOR

RELATED ARTICLES