సేనానికి చిక్కులు...అసలు అభిమానులకు ఎందుకు కోపమొచ్చింది?

సేనానికి చిక్కులు...అసలు అభిమానులకు ఎందుకు కోపమొచ్చింది?
x
Highlights

జనసేనానికి అప్పుడే తలనొప్పులు మొదలయ్యాయా? పవన్‌కు అండగా ఉంటూ వస్తోన్న ఫ్యాన్స్‌ క్రమంగా దూరంగా జరుగుతున్నారా? అసలు అభిమానులకు ఎందుకు కోపమొచ్చింది?...

జనసేనానికి అప్పుడే తలనొప్పులు మొదలయ్యాయా? పవన్‌కు అండగా ఉంటూ వస్తోన్న ఫ్యాన్స్‌ క్రమంగా దూరంగా జరుగుతున్నారా? అసలు అభిమానులకు ఎందుకు కోపమొచ్చింది? సమస్యలను పరిష్కరించాల్సిన పవన్ చేతులెత్తేశారా? ఇప్పుడిప్పుడే జనంలోకి దూసుకెళ్తోన్న జనసేనలో అసలేం జరుగుతోంది?

ప్రజా పోరాట యాత్రతో దూకుడు పెంచిన జనసేనాని తన ఆవేశపూరిత ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకుంటూ తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. తనదైన స్ట్రాటజీతో, ప్రజాసమస్యలపై గొంతెత్తుతూ దూసుకుపోతున్నారు. దాంతో జనసేనలోకి ఇప్పుడిప్పుడే ముఖ్యనేతల చేరికలు ప్రారంభమయ్యాయి. అయితే అదే సమయంలో జనసేనానికి కొత్త తలనొప్పులు కూడా మొదలయ్యాయి.

ముఖ్యంగా జనసేన కార్యకర్తలకు, పవన్‌ ఫ్యాన్స్‌కు మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. జనసేన కార్యకర్తలు, వాలంటీర్లకు, పవన్‌ ఫ్యాన్స్‌కు కోల్డ్‌ వార్‌ తారాస్థాయికి చేరింది. పవన్‌ యాత్రలో జనసేన కార్యకర్తలకు, వాలంటీర్లకు ఇస్తోన్న విలువ ఫ్యాన్స్‌కు ఇవ్వడం లేదని అభిమాన సంఘాలు గుర్రుగా ఉన్నారు. అభిమానులు పవన్‌‌ను కలవకుండా వాలంటీర్లు, కార్యకర్తలు అడ్డుకుంటున్నారని మండిపడుతున్నారు. ముఖ్యంగా పవన్‌ పోరాట యాత్రలో ఫ్యాన్స్‌ను కనీసం లెక్కలోకి తీసుకోవడం లేదని వాపోతున్నారు.

అభిమానులను పవన్‌ నిర్లక్ష్యం చేయడాన్ని ఫ్యాన్స్‌ జీర్ణించుకోలేకపోతున్నారు. పవన్‌ సినిమా హిట్టయినా ప్లాపైనా అండగా ఉంటూ వచ్చిన అభిమాన సంఘాలను పట్టించుకోకపోవడం సరికాదంటున్నారు. పవన్‌ కోసం అనేక కార్యక్రమాలను చేపడుతూ ఏళ్ల తరబడి పవన్‌ మాటలను జనాల్లోకి తీసుకెళ్లిన ఫ్యాన్స్‌ అసోసియేషన్లను పరిగణనలోకి తీసుకోకపోవడం తగదంటున్నారు.

పోరాట యాత్రలో తమకు జరుగుతోన్న అవమానాన్ని జనసేనాని దృష్టికి తీసుకెళ్లినా లైట్‌ తీసుకున్నారంటూ రెండు రాష్ట్రాల్లోని పవన్‌ ఫ్యాన్స్‌ రగిలిపోతున్నారు. అయితే ఎన్నికలవేళ్ల ఇలాంటి విభేదాలు మంచిది కాదని, ఫ్యాన్స్‌, కార్యకర్తలు రెండుగా చీలితే అసలుకే ముప్పు వస్తుందంటున్నారు విశ్లేషకులు. పవన్‌ కల్పించుకుని రెండు వర్గాల మధ్య గ్యాప్‌ను తొలగించి సమన్వయపర్చాల్సిన అవసముందంటున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories