రంగంలోకి దిగిన పవన్ కల్యాణ్

Submitted by arun on Fri, 02/09/2018 - 10:16
Pawan Kalyan

విభనజన హామీల అమలు కోసం జేఏసీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ దిశగా తొలి అడుగు వేశారు మొదటగా లోకసత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ్ కలిసిన పవన్ జేఏసీ విధివిధానాలు పై చర్చించారు. విభజన హామీలు అమలు జరిగేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సిద్ధమయ్యారు ఇందులో భాగంగా నిన్న బేగంపేటలోని లోక్‌సత్తా కార్యాలయంలో జరిగిన జయప్రకాష్ నారాయణను కలిసిన పవన్.. విభజన హామీలను ముందుకు తీసుకువెళ్లేందుకు దిశా నిర్ధేశం చేయాలని జేపీని అడిగినట్లు తెలిపారు.

దీనికి జయప్రకాష్ నారాయణ సుముఖత వ్యక్తం చేసారన్న పవన్.. విభజన సమస్యల పరిష్కారం వైపుగా కలిసి పోరాటం చేస్తామని తెలిపారు. త్వరలోనే విధి విధానాలు అన్ని ఖరారు చేసి. మేధావులతో కలిసి నిర్ణయం తీసుకుని కేంద్రప్రభుత్వా దృష్టికి తీసుకువెళ్తాం అన్నారు. ఇది ఒక్కరి సమస్య కాదు కాబట్టి అందరూ కలిసి ఒక సమూహంగా పోరాటం చేయాలి అని పవన్ పిలుపునిచ్చారు.

అందరం కూర్చొని వేదిక ఏర్పాటు చేయాలన్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఆలోచనకు తాను మద్దతిస్తున్నానని లోక్‌సత్తా వ్యవస్థాపకుడు జయప్రకాశ్‌ నారాయణ తెలిపారు. పవన్‌ చెప్పినట్లు ఒక గంటలో సమస్యను పరిష్కరించే సామర్థ్యం ఎవరికీ లేదని అన్నారు. సినిమాల్లో ఎంతో భవిష్యత్‌ ఉన్నప్పటికీ ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్‌ కల్యాణ్‌ను తాను అభినందిస్తున్నానని జయప్రకాశ్‌ నారాయణ అన్నారు. సమాజం కోసం ఏదైనా చేయాలన్న బలమైన ఆకాంక్ష ఉంటేనే అది సాధ్యమని కొనియాడారు. రాష్ట్ర విభజన విషయంలో పార్లమెంట్‌లో సుదీర్ఘంగా చర్చించి చట్టం చేసిన తర్వాత కూడా విభజన హామీలను అమలు చేయలేదని కేంద్రంపై మండిపడ్డారు. మొత్తం మీద తెలంగాణ ఉద్యమం తరహాలో అన్ని రాజకీయ పార్టీలను మేధావులను ఏక తాటి పైకి తీసుకురావడంలో.. పవన్ ఎంత వరకు సక్సెస్ అవతాడో వేచి చూడాలి.

English Title
Pawan Kalyan’s JAC plans

MORE FROM AUTHOR

RELATED ARTICLES