తాను ఒకటి తలుస్తే..దైవం ఒకటి తలిచినట్టు

Submitted by arun on Sun, 01/14/2018 - 16:45
pk

అజ్ఞాతవాసి మూవీతో పవన్ కళ్యాణ్ అగాధంలో పడిపోయాడు. తాను ఒకటి తలుస్తే...దైవం ఒకటి తలిచినట్టు...అజ్ఞాతవాసి మూవీ ప్లాప్ తో ప్లాన్ అంతా రివర్స్ ఐంది. అజ్ఞాతవాసి హిట్ తో ఇక సినిమాలకు పుల్ స్టాప్ పెట్టి జనాల్లోకి వెళ్లానుకున్నాడు. కానీ ఈసినిమా డిజాస్టర్ గా మిగిలిపోయింది. దీంతో మరో సినిమా చేయాలా వద్దా అనే సందిగ్గంలో పడ్డాడు. ఇంతకు పవన్ ఇంకో సినిమా చేస్తాడా..లేదా..

జనసేన పార్టీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఎన్నికలు సమీపిస్తుండడంతో హిట్ సినిమాతో సినీ కెరీర్ వీడ్కోలు చెప్పాలనుకున్నాడు. అందుకు అజ్ఞాతవాసి మూవీనే చివరి సినిమాగా అల్మోస్ట్ ఫిక్స్ అయ్యాడు. ఈ సినిమా హిట్ తో వచ్చిన క్రేజ్ ను వాడుకుని జనాల్లోకి వెళ్లాలనుకున్నాడు. కానీ అజ్ఞాతవాసితో పవన్ ప్లాన్ రివర్స్ ఐంది. సినిమా వీరలెవెల్లో ఆడుదనుకుంటే..పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. పొలిటికల్ గా రాణించాలంటే..ఈ సినిమా ఫలితంతో ఫ్యాన్స్ లో..జనాల్లో ఊపు తీసుకురావడం కష‌్టం. దీంతో వాట్ నెక్ట్స్ అనే సందిగ్గంలో పడ్డాడు.

అజ్ఞాతవాసి ఫలితంతో పవన్ కళ్యాణ్ కు వరుసగా హ్యాట్రిక్ ఫ్లాప్ లు పడ్డాడు. ఈ పరిస్థితిలో పొలిటికల్ గా జనాల్లో ఊపు తీసుకురావడం కష్టం. వాళ్లలో జోష్ నింపాలంటే..హిట్ కొట్టాల్సిందే. దీంతో పవన్ ప్యూచర్ ప్లానింగ్ ఓ క్వశ్చన్ మార్క్ లా మారింది. మళ్లీ సినిమా చేయాలా వద్దా అనే తికమకలో పడ్డాడు. లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్పా అనే డైలాగ్ ను ఇప్పుడు పవన్ కళ్యాణే మననం చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లాస్ట్ హిట్ కొట్టకుండా గుడ్ బై చెబితే..కిక్కు ఉండదు కదా..

అజ్ఞాతవాసి మూవీపై ఉన్న కాన్పిడెంట్ తోనే పవన్ మరో సినిమాపై పెద్దగా ద్రుష్టిపెట్టలేదు. నిర్మాతలు, డైరెక్టర్ల నుంచి భారీ ఆఫర్ ఇచ్చినా ఎవరికి సినిమా చేస్తానని హామీ ఇవ్వలేదు. ఏఎమ్ రత్నంతో మూవీకి ఓపెనింగ్ చేసినా ఆ కథ ముందుకు సాగలేదు. అజ్ఞాతవాసినే చివరి సినిమాగా ఫిక్స్ అయ్యాడు. కానీ ఇప్పుడు సిచ్చువేషన్ మారడంతో..మరో సినిమా చేయాలా వద్దా అనే ఆలోచనలో పడ్డాడు. ఏఎమ్ రత్నం మూవీని మళ్లీ తెరపైకి తీసుకురావాలనే ఆలోచనలో ఉన్నాడు.

ఏఎమ్ రత్నం పవన్ కళ్యాణ్ తో సినిమాకు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు. తమిళ్ సూపర్ హిట్ మూవీ వీరంను రీమేక్ చేయాలనుకున్నాడు. దానికి ఏడాది క్రితమే ఓపెనింగ్ కూడా చేశాడు. కానీ ఇప్పటి వరకు దానిపై ఎలాంటి క్లారిఫై లేదు. ఒకవేళ పవన్ నెక్ట్స్ మూవీ చేస్తే..ఏఎమ్ రత్నం నిర్మాణంలో చేస్తాడా లేక మరో డైరెక్టర్ తో చేస్తాడా అనేది వెయ్యి ప్రశ‌్నలుగా మారింది. మొత్తానికి పవన్ నెక్ట్స్ ప్లానింగ్ ఏంటనే ప్రశ్న పెద్ద క్వశ్చన్ మార్క్ గా మారింది.

English Title
pawan kalyans agnyaathavaasi fails

MORE FROM AUTHOR

RELATED ARTICLES