స్పెషల్ అట్రాక్షన్‌గా పవన్ భార్య లెజ్నోవా

Submitted by arun on Tue, 01/23/2018 - 11:51

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కొండగట్టు టూర్‌‌కు ముందు భార్య లెజ్నోవా స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. రష్యాలో పుట్టినప్పటికీ తెలుగు సాంప్రదాయాలకు గౌరవమిస్తున్నారు. క్రిస్టియన్‌ అయినప్పటికీ హిందూ సాంప్రదాయాలను పాటించి ప్రత్యేకతను చాటుకున్నారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు తెలియకపోయినా పవన్‌ కల్యాణ్‌ సూచనలతో ఆచరిస్తున్నారు. 

అన్నా లెజ్నోవా రష్యా మోడల్. తీన్‌మార్‌ సినిమా ద్వారా పరిచయమైన లెజ్నోవా ఆ తరువాత పవన్‌ కల్యాణ్‌ను వివాహం చేసుకున్నారు. కొన్నేళ్ల పాటు బయట ఎక్కడా కనిపించలేదు. చిరంజీవి ఇంట్లో జరిగిన ఓ ఫంక్షన్‌‌కు అటెండ్‌ అయిన ఆమె ఆ తర్వాత బయటకు రాలేదు. పోలాండ్‌ అంబాసిడర్‌ బురాకోవస్కీ, మహారాజా కళాశాల విద్యార్థులు పవన్‌ కల్యాణ్‌ను కలిసినపుడు వారికి పుష్పగుచ్చం స్వాగతం పలికారు. ఈ సమావేశంలో లెజ్నోవా తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు.

తాజాగా పవన్‌ కల్యాణ్‌ కొండగట్టు వెళ్లేందుకు జనసేన కార్యాలయం నుంచి పవన్‌ బయటకు వచ్చారు. భర్తనే ఫాలో అయి సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచారు అన్నా లెజ్నోవా. పక్కనున్న వారంతా ఆశ్చర్యపోయేలా పవన్‌ కల్యాణ్‌కు తెలుగు సంప్రదాయాల ప్రకారం హారతి ఇచ్చారు. హారతి ఇచ్చిన వెంటనే భర్త సూచనలతో అన్నా ఉంగరం వేలితో పవన్‌కు తిలకం దిద్దారు. ఆ తర్వాత హరతిపళ్లెంలో ఉన్న వీరకంకణాన్ని పక్కనున్న మహిళలు పవన్‌ కుడి చేయికి కట్టారు. ఈ తంతు ముగిసిన వెంటనే పక్కనున్న మహిళలు గుమ్మడికాయతో పవన్‌కు దిష్టితీశారు.

ఆ తర్వాత పవన్‌ కల్యాణ్‌ కొండగట్టుకు వెళ్లే ఏపీ ‌07 డీకే 2324 వాహనానికి కొబ్బరికాయ దిష్టి తీశారు. కొబ్బరికాయ కొట్టిన తర్వాత పవన్‌ కల్యాణ్‌ను ఆలింగనం చేసుకోవడంతో జనసేనాని భార్య లెజ్నోవాకు ప్రేమతో ముందు పెట్టారు. పూజ కార్యక్రమాలు ముగిసిన వెంటనే పవన్‌ కల్యాణ్‌ ప్రయాణించే వాహనానికి ఎదురొచ్చి భర్తను సాగనంపారు అన్నా లెజ్నోవా. భర్తకు హరతిచ్చి తిలకం దిద్దడంపై పవన్‌ అభిమానులు, జనసేన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

English Title
Pawan Kalyan Wife Anna Lezhneva Special Attraction In PK

MORE FROM AUTHOR

RELATED ARTICLES