సీఎం కేసీఆర్‌ను కలిస్తే తప్పేంటి?: పవన్

Submitted by arun on Mon, 01/22/2018 - 19:41
pkkcr

తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కే చంద్రశేఖర్‌రావును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబితే తప్పేంటని పవన్‌ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆయన కీలక పాత్ర పోషించిన కేసీఆర్‌ ఆయన చేయగలిగింది రాష్ట్రానికి చేస్తున్నారని అన్నారు. అందుకే ప్రజలు ఆయనకు పట్టం కట్టారన్నారు. తెలంగాణ తీసుకొచ్చారని కేసీఆర్‌ను ప్రజలు నమ్మారని చెప్పారు పవన్.

ఎన్నికలకు రెండు నెలల ముందు తమ బలమెంటో తెలుస్తుందన్న పవన్‌ కల్యాణ్‌...బలమున్న స్థానాల్లోనే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ పోరాటంపై గౌరవముందన్న పవన్ కల్యాణ్‌...తనను బాధ్యతగా వ్యవహరించేలా చేస్తాయన్నారు. రాజకీయ పార్టీలపై ఎలా పడితే అలా మాట్లాడే వ్యక్తిని కాదన్నారు. ఎక్కువ శాతం మంది న్యాయం జరిగే విధంగా జనసేన వ్యవహరిస్తుందన్న పవన్ కల్యాణ్‌...ప్రజలు ఎన్నుకున్న పార్టీని గౌరవించాలని స్పష్టం చేశారు. బీజేపీలోకి ఆహ్వానించిన దాన్ని సున్నితంగా తిరస్కరించానని పవన్‌ వెల్లడించారు. 
 

English Title
Pawan Kalyan says cm kcr meet

MORE FROM AUTHOR

RELATED ARTICLES