ఏడో తరగతిలో ఏమైందంటే..: పవన్‌

Submitted by arun on Fri, 07/06/2018 - 11:06
pk

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఉత్తరాంధ్ర పర్యటనలో బిజీగా ఉన్నారు. గురువారం విశాఖలో సభ నిర్వహించి ప్రతిపక్షంపై విమర్శలు గుప్పించిన పవన్, సాయంత్రానికి ఆటవిడుపా అన్నట్టు ఒక సరదా పిక్‌ను పోస్ట్ చేశారు. తాను నెల్లూరులో ఏడవతరగతి చదువుతున్నప్పుడు తన అన్నయ్యలు, అక్కాచెల్లెళ్లతో దిగిన ఫొటో ఇది. అది ఆయన ఏడో తరగతిలో ఉండగా తీసుకున్న నలుపు, తెలుపు చిత్రం. అందులో ఆయన అన్నయ్యలు మెగాస్టార్‌ చిరంజీవి, నాగబాబులు ఉన్నారు. పవన్‌, అక్కా చెల్లెళ్లూ ఉన్నారు. ‘అప్పుడు మేము నెల్లూరులో ఉన్నాం. నేను ఏడో తరగతి చదువుతున్నా. చాలా కాలం బ్రాంకైటిస్‌తో బాధపడ్డా. ఆ అస్వస్థత నుంచి బయటపడ్డాక ఈ ఫొటో  తీసుకున్నాం’ అంటూ పవన్‌కల్యాణ్‌ ట్వీట్‌ చేసిన ఈ చిత్రం ఆసక్తి రేపుతోంది. విశాఖ పర్యటనలో ఉన్న పవన్‌ అనేక అంశాలను ట్వీట్‌ చేస్తూ మధ్యలో ఈ ఫొటోను ఉంచారు.

English Title
pawan kalyan posted a-rare pic of his family

MORE FROM AUTHOR

RELATED ARTICLES