హిట్టైనా రికార్డే ఫ్లాపైనా రికార్డే

హిట్టైనా రికార్డే ఫ్లాపైనా రికార్డే
x
Highlights

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మూవీ వస్తోందంటేనే, అది హిట్టైనా ఫ్లాపైనా రికార్డు క్రియేట్ చేయటం కామన్ పవన్ సినిమా అంటేనే బాక్సాఫీస్ లో వసూళ్లతో అతివ్రుష్టి...

పవర్ స్టార్ పవన్ కళ్యాన్ మూవీ వస్తోందంటేనే, అది హిట్టైనా ఫ్లాపైనా రికార్డు క్రియేట్ చేయటం కామన్ పవన్ సినిమా అంటేనే బాక్సాఫీస్ లో వసూళ్లతో అతివ్రుష్టి రావొచ్చు లేదంటే అనా వ్రుష్టి అయినా రావొచ్చు. అగ్నాతవాసి మూవీ విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్ తో రికార్డ్ స్రుష్టించింది. తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ రిలీజ్ రైట్స్ 92. 40 కోట్లకు సేల్ అయ్యాయి. ఇక రెస్టాఫ్ ఇండియా రైట్స్ 14 కోట్లు పలికితే, ఓవర్ సీస్ రైట్స్ 19.4 కోట్లకు సేల్ అయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా అగ్నాతవాసి థియేట్రికల్ రైట్స్ 125 కోట్లకు సేల్ అయ్యాయి. బాహుబలి ది బిగినింగ్ తో పోలిస్తే, ఆ సినిమా వోల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ 117.30 కోట్లు మాత్రమే రాబట్టింది. అలా చూస్తే అగ్నాత వాసి బాహుబలిని దాటేసినట్టే. ఇక శాటిలైట్ రైట్స్ 32 కోట్లు పలికితే, ఆడియో రైట్స్ 2 కోట్లు ఓవరాల్ గా అన్ని రైట్స్ తో కలిపి అగ్నాత వాసి ప్రీరిలీజ్ బిజినెస్ లెక్కేస్తే 160 కోట్ల పైమాటే. అసలు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ అంటేనే హిట్టైనా, ఫ్లాపైనా అదో రికార్డ్ గబ్బర్ సింగ్ నుంచే ఈ ట్రెండ్ క్రియేట్ అయ్యింది ఈ మూవీ రిలీజైన 3 వారాల్లోనే వసూళ్లు 63. 40 కోట్లు రావటం అప్పట్లో పెను సంచలనమైంది. 30 కోట్ల పెట్టుబడికి 151 కోట్ల గ్రాస్ వసూల్లు వచ్చాయి.

వందకోట్ల పెద్ద విషయం అనుకున్న రోజుల్లోనే గబ్బర్ సింగ్ వచ్చి, హిట్ అనగానే, 150 కోట్ల వసూల్లొచ్చాయి. బాక్సాఫీస్ లో వసూళ్ల వరదలొచ్చాయి ఇండస్ట్రీ రికార్డ్సే తిరగరాశాయి చరిత్ర స్రుష్టించాయి
పవన్ మూవీ హిట్ అంటే బ్లాక్ బస్టర్, ప్లాప్ అంటే డిజాస్టర్ రిజల్ట్ ఏదైనా రెండీంట్లో తనకు తానే పోటీ. గబ్బర్ సింగ్ హిట్ అంటే బాక్సాఫీస్ షేక్ అయ్యింది కాని తర్వాతొచ్చిన కెమెరా మెన్ గంగతో రాంబాబు ఫ్లాపైంది అంతే డిజాస్టర్లన్నీంట్లో టాప్ డిజాస్టర్ అనిపించుకుంది. 25 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కెమెరా మెన్ గంగతో రాంబాబు మూవీ అప్పట్లో 70 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది కాని 50 కోట్ల రాబట్టడం కూడా గగనమైంది 20 నుంచి పాతిక కోట్ల నష్టాలతో డిస్ట్రిబ్యూటర్లు మునగాల్సివచ్చింది పూరీ, పవన్ ల మధ్య ఫ్లాప్ కి రీజన్ నువ్వంటే నువ్వనేంతగా చిన్నాపాటి వార్ జరిగింది. మొత్తానికి ఇలా డిజాస్టర్లతో కూడా పవన్ రికార్డ్స్ క్రియెట్ చేశాడు.

అత్తారింటికి దారేది మూవీ కి అప్పట్లో పెట్టిన పెట్టుబడి 55 కోట్లు ప్రీరిలీజ్ బిజినెస్ తో 100 కోట్లు వచ్చాయి రిలీజ్ కిముందే సినిమా లీకైనా, హిట్ అయ్యింది. అంతే దెబ్బకి 180 కోట్ల వసూళ్లొచ్చాయి. టాలీవుడ్ టాప్ ఫైవ్ బ్లాక్ బస్టర్స్ లో హిస్టరీ క్రియేట్ చేసిన మూవీగా ఈసినిమా మిగిలిపోయింది. అత్తారింటికి దారేది హిట్ అనగానే, అప్పట్లో ఇండస్ట్రీ రికార్డులు మారిపోయాయి. పైరసీకి గురైనా కాని, వసూళ్ల వరద తెచ్చిన సినిమాగా ఇండస్ట్రీ గుర్తుంచుకునే రికార్డ్ క్రియేట్ చేసింది అత్తారింటికి దారేది మూవీ. అందుకే పవన్ మూవీ హిట్టంటే ఓ చరిత్ర ఫ్లాపైనా కూడా చరిత్రే.

త్రివిక్రమ్ మేకింగ్ లో పవన్ చేసిన రొండో మూవీ, పవన్ కెరీర్ లోనే హైయ్యెస్ట్ కలెక్షన్లతో రికార్డ్ స్రుష్టించిన మూవీ అత్తారింటికి దారేది. అలాంట ఈ హిట్ తర్వాత వచ్చిన గోపాల గోపాల కూడా బానే వసూల్ళు రాబట్టినా, సర్ధార్ గబ్బర్ సింగ్ మాత్రం ఇండస్ట్రీలో టాప్ డిజాస్టర్స్ లో నెంబర్ వన్ అనిపించుకుంది. గబ్బర్ సింగ్ తర్వాత అదే మూవీకి పార్ట్ 2 గా వచ్చిన సర్ధార్ గబ్బర్ సింగ్ రిలీజ్ కు ముందు, 108 కోట్లు బిజినెస్ చేసింది. కాని ఫ్లాప్ అనగానే, లెక్కలు తారుమారయ్యాయి. కనీసం 75 కోట్లు రాబట్టడమే గగనమైంది. డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లకు కోలుకోలేని దెబ్బ తగిలింది. పాతికోట్లవరకు డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోవటంతో, వాళ్లకి ఫిల్మ్ టీం తిరిగి చెల్లించుకనేంతవరకు పరిస్థితి మారిపోయింది.

గబ్బర్ సింగ్ ఎంత హిట్టో సర్ధార్ గబ్బర్ సింగ్ అంత పెద్ద ప్లాప్ అంతే ఆదెబ్బకి డీలా పడ్డ డిస్ట్రిబ్యూటర్లకి కాటమరాయుడు ఆఫర్ ఇచ్చాడు పవన్ అలా కాటమ రాయుడు రిలీజ్ కి ముందు 103 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది కాని ఇది కూడా ఫ్లాపై, మళ్లీ డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు కాంపెన్సేషన్ అడిగే పరిస్థితొచ్చింది అలా చూస్తే హిట్లతోనే కాదు, ఫ్లాపులతో కూడా రికార్డ్స్ క్రియేట్ చేసిన హిస్టరీ పవన్ కి మాత్రమే సొంతం.
కాటమ రాయుడు మూవీకి 108 కోట్ల ప్రీరిలీజ్ అవటంతో, నిర్మాతసేఫ్ అయ్యాడు కావొచ్చు కాని, కేవలం 78 కోట్ల వసూళ్లే రాబట్టి, ఈ డిజాస్టర్ తో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు నష్టపోయారు ఇంత పంచ్ పడ్డాక కోలుకోవటం కష్టం కాని అదే హీరో అగ్నాతవాసి తీయగానే, 160 కోట్ల ప్రీరిలీజ్ బిజినెస్ జరిగింది అందుకే పవన్ కళ్యాన్ హిట్టైనా, ఫ్లాపైనా, ఏం చేసినా రికార్డ్ అవుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories