తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పవన్ స్పందన

తెలంగాణ ఎన్నికల ఫలితాలపై పవన్ స్పందన
x
Highlights

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయవేత్తలు వరుస ట్వీట్ల, ఫోన్లతో అభినందనలు...

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అఖండ విజయం సాధించింది. ఈ నేపథ్యంలో పలువురు సినీ, రాజకీయవేత్తలు వరుస ట్వీట్ల, ఫోన్లతో అభినందనలు తెలిపుతున్నారు. తాజాగా టీఆర్ఎస్ పార్టీ విజయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్వీట్టర్ వేదికగా స్పందించారు. టీఆర్ఎస్ అధినేత కెసిఆర్, కెటిఆర్, హరీశ్ రావు పార్టీ శ్రేణులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భం పవన్ కళ్యాణ్ ఓ లేకను విడుదల చేశారు. ఎంత మంది అమరుల త్యాగాలతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి కూడా ప్రజలు టీఆర్ఎస్ కే ప్రజలు అధికార పగ్గాలు అందజేశారని ఈ తీర్పుతో తెలంగాణ ప్రజల విజ్ఞత మరోసారి రుజువైందని అన్నారు. ఈ ఎన్నికలలో అత్యధిక మెజార్టీతో గెలుపొందిన శ్రీ హరీష్ రావు గారికి నా శుభాకాంక్షలు. విజయం సాధించిన ప్రతి ఒక్కరితోపాటు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు నా అభినందనలు’’ అని లేఖలో పవన్ పేర్కొన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories