బిగ్ బ్రేకింగ్ : అతనితో రేణుదేశాయ్ ఎంగేజ్‌మెంట్ జరిగిపోయింది.

Submitted by nanireddy on Sun, 06/24/2018 - 13:04
pawan-kalyan-ex-wife-renu-desai-got-engaged

పవన్ కళ్యాణ్ రెండో భార్య రేణుదేశాయ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నారు. అందుకోసం ఆమె ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా రేణు దేశాయ్ వెల్లడించింది. ప్రస్తుతం పవన్ కల్యాణ్‌ తో విడాకుల అనంతరం మాజీ హీరోయిన్ రేణుదేశాయ్ తన పిల్లలతో కలిసి పుణేలో నివాసం ఉంటున్నారు. ఒంటరితనం వేధిస్తోందని, తనను అర్థం చేసుకునే జీవిత భాగస్వామి కోసం ఎదురు చూస్తున్నానని గతంలో ఆమె ఇంటర్వ్యూలలో చెప్పింది.అయితే  ఇటీవల ఓ వ్యక్తి చేయి పట్టుకొని దిగిన ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసిన రేణు దేశాయ్.. 'నా చేతిని ఎప్పటికీ వీడకు.. నన్ను ఎప్పటికీ వదిలి వెళ్లకు. ప్రేమ కోసం ఎక్కడెక్కడో వెతికానంటూ..' కవిత రూపంలో తనకు కాబోయే వరుడి గురించి చెప్పింది.

ఆదివారం ఓ వ్యక్తి చేతి మీద అందంగా మెహందీతో మెరిసిపోతున్న చేతిని ఉంచిన ఫోటోను రేణూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఇద్దరి చేతి వేళ్లకు ఉంగరాలున్న ఆ ఫొటోకు ఎంగేజ్‌డ్ అనే కామెంట్ జత చేసింది. తనకు ఎంగేజ్‌మెంట్ అయిందని రేణుదేశాయ్ ఈ ఫొటో ద్వారా చెప్పింది. అయితే ఈ ఫోటోపై పవన్ అభిమానులు కొందరు మండిపడుతుంటే మరికొందరు రేణూకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. 

English Title
pawan-kalyan-ex-wife-renu-desai-got-engaged

MORE FROM AUTHOR

RELATED ARTICLES