అమ‌రావ‌తి మాస్ట‌ర్ ప్లాన్ పై ప‌వ‌న్ విమ‌ర్శ‌లు

Submitted by lakshman on Sun, 03/18/2018 - 23:17
Pawan Kalyan Comments on Amaravati Master Plans


ఏపీ ప్ర‌భుత్వంపై జ‌న‌సేన అధ్య‌క్షుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ విమ‌ర్శ‌ల ప‌ర్వం కొన‌సాగుతుంది. జ‌న‌సేన పార్టీ ఆవిర్భావం సంద‌ర్భంగా మాట్లాడిన స‌భ నుంచి రోజుకో అంశంపై వేలెత్తి చూపించి ప్ర‌భుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. 
గుంటూరు స‌భ‌లో ప్ర‌భుత్వం ప‌నితీరు, అవినీతిపై ఆరోప‌ణ‌లు చేసిన పవ‌న్ ఏపీ రాజ‌ధాని ప‌రిస‌ర ప్రాంతాల్లో ఉన్న స‌మ‌స్య‌ల‌పై దృష్టిసారించారు. వాటిని ప‌రిష్కారం చేసే దిశాగా చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.
గుంటూరులో అతిసారా బాధితుల‌ను ప‌రామర్శించారు. ఈ సంద‌ర్భంగా ఏపీ ప్ర‌భుత్వంపై మండిప‌డ్డారు. అతిసారా వ్యాధితో ప్ర‌జ‌ల ప్రాణాలు పోతుంటే ప్ర‌భుత్వం రాజ‌కీయం చేస్తుంద‌ని ఆరోపించారు. త‌క్ష‌ణ‌మే బాధితుల‌కు అండ‌గా నిల‌వాల‌ని ప్ర‌భుత్వానికి సూచించారు. అంతేకాదు గుంటూరు జిల్లాలో హెల్త్ ఎమ‌ర్జ‌న్సీ ప్ర‌క‌టించాల‌ని డిమాండ్ చేశారు. 
దీంతో అల‌ర్ట్ అయిన సీఎం చంద్ర‌బాబు ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ స‌మీక్ష‌లో అతిసార బాధితుల‌కు వైద్యం అందించాల‌ని సూచించారు. మున్సిప‌ల్ అధికారుల‌పై వేటు వేశారు. 
ఈ రోజు అమ‌రావ‌తిలోని ఉద్దండ్రాయునిపాలెం రైతుల‌తో భేటీ అయ్యారు. అక్క‌డ‌సమ‌స్య‌లు , భూసేక‌ర‌ణ‌పై వివ‌రాల్ని అడిగితెలుసుకున్నారు. అనంత‌రం మీడియాతో మాట్లాడిన ప‌వ‌న్ ఏపీకి ప్ర‌త్యేక‌కోసం ఏర్పాటు చేసిన మాస్ట‌ర్ ప్లాన్ ఫైన‌ల్ కాద‌ని బాంబు పేల్చారు. 
 ఒక రాష్ట్ర రాజధాని నిర్మాణం అంటే ఆషామాషీ వ్యవహారం కాదని, అందుకు రెండు దశాబ్దాలకు పైగానే సమయం పట్టొచ్చని పవన్ అభిప్రాయపడ్డారు. అన్ని పార్టీలు కూర్చొని రాజధాని నిర్మాణంపై ఒక నిర్ణయం తీసుకోవాలన్నారు. అమరావతి నిర్మాణం కోసం ప్రస్తుతం ప్రభుత్వం చూపిస్తున్న మాస్టర్ ప్లాన్ తుదిదేం కాదని కుండబద్దలు కొట్టారు.
రాజధాని మాస్టర్ ప్లాన్ కోసం మరిన్ని చర్చలు జరగాల్సి ఉంది. మార్పులు కూడా చేయాల్సి ఉంది. పార్టీలు, మేధావుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయానికి రావాలి. రాత్రికి రాత్రే పెద్ద నగరం కట్టాలన్న ఆకాంక్ష ప్రభుత్వాలకు ఉండొచ్చు.. కానీ, అందుకోసం ప్రజలను దీర్ఘకాలిక ఇబ్బందులకు గురి చేయటం సరికాదు. సింగపూర్ తరహా రాజధాని ఏర్పాటు అంటే పాలన కూడా అదే రీతిలో ఉంటేనే సాధ్యమౌతుంది’ అని పవన్‌ టీడీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 
 ప్రభుత్వంపై పోరాటం నా అభిమతం కాదు. కేవలం పాలసీలకు వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తున్నాను. నా దగ్గర అన్ని సమస్యలకు పరిష్కారాలు లేవు. సమస్యలు ఏవైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు నేను ఎప్పుడూ సిద్ధంగా ఉంటాను. ఒకవేళ అప్పటికీ 

English Title
Pawan Kalyan Comments on Amaravati Master Plans

MORE FROM AUTHOR

RELATED ARTICLES