చిరంజీవి కంటే పవన్ కల్యాణ్ చాలా నయం

Submitted by lakshman on Thu, 03/15/2018 - 17:28
Is Pawan Kalyan better than Chiranjeevi

ఈ మాట మేం కాదు అనేది… జనాలే అంటున్నారు. ఎందుకంటే.. వాస్తవాలను కాస్త పరిశీలనలోకి తీసుకుంటే.. ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి సాధించింది ఏమీ లేదు. 18 శాతం ఓట్లు సంపాదించారు కానీ.. వాటిని అధికారం దిశగా మళ్లించే ప్రయత్నం మాత్రం ఆయన చేయలేకపోయారు. చివరికి ఉన్న పార్టీని కూడా.. కాంగ్రెస్ లో కలిపేశారు. నమ్ముకున్న వాళ్లను నట్టేట ముంచారన్న ఆరోపణలను ఇప్పటికీ ఎదుర్కొంటున్నారు. దానికి తోడు.. తన రాజకీయ ప్రస్థానంలో.. కనీసం జనం నుంచి మెప్పించే ప్రసంగాన్ని ఒక్కటి కూడా చిరంజీవి ఇవ్వలేకపోయారు.

కానీ.. జనసేన పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్.. తన అన్న చిరంజీవితో పోలిస్తే.. కాస్త మార్పు చూపిస్తున్నారు. జనానికి సూటిగా తాకేలా.. సినిమాటిక్ స్టయిల్ లో అయినా సరే.. ఆవేశపూరిత ప్రసంగాలు ఇస్తున్నారు. సమస్యలను నేరుగా ధైర్యంగా ప్రస్తావిస్తూ కొత్త చర్చలకు అవకాశం కల్పిస్తున్నారు. మేనిఫెస్టో అని ముందే అంటూ.. ఇతర పార్టీలకు నేరుగా సవాల్ విసురుతున్నారు. పూర్తి స్థాయిలో కేడర్ లేకున్నా.. అనుచరగణం అనుచర బలం ఇంకా సముపార్జించుకోకున్నా ధైర్యంగా ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు.

రాజకీయ నాయకుడిగా చిరంజీవి చూపించిన పరిణతి కంటే.. పవన్ కల్యాణ్ కాస్త మెరుగ్గానే ముందుకు పోతున్నారని జనం కూడా అంటున్నారు. ఆరోపణలు చేయడంలో.. కేంద్రాన్ని నిలదీయడంలో.. రాష్ట్ర హక్కులు ప్రస్తావించడంలో.. హోదా కోసం దీక్షకు కూర్చుంటానని చెప్పడంలో.. పవన్ శైలి కాస్త భిన్నంగానే ఉన్నట్టు ఆయన అభిమానులే కాదు.. ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అదీ సంగతి.

English Title
Is Pawan Kalyan better than Chiranjeevi

MORE FROM AUTHOR

RELATED ARTICLES