రాజకీయం వేరు.. అనుబంధం వేరు!

Submitted by arun on Wed, 03/28/2018 - 13:42
mega

రాజకీయం వేరు.. అన్నాదమ్ముల అనుబంధం వేరు. ఈ మాటను.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎప్పుడూ చెబుతూనే ఉంటాడు. రాజకీయంగా.. వ్యక్తిగతంగా.. చిరంజీవితో తనకు భేదాభిప్రాయాలు ఉండొచ్చు కానీ.. అన్నాదమ్ములుగా తాము ఎన్నడూ కలిసే ఉంటామని.. అన్నయ్య విషయంలో తన ప్రేమ ఎప్పుడూ ఒకేలా ఉంటుందని.. పవన్ సందర్భం దొరికినప్పుడల్లా చెబుతూనే ఉంటాడు.. ఇప్పుడు ఆ మాటను నిజం అని నిరూపించుకున్నాడు కూడా.

నిన్న.. రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా.. చిరు ఇంట్లో సంబురాలు చేసుకున్నారు. ఆ వేడుకకు.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సడన్ అపియరెన్స్ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు. చరణ్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. బాబాయ్ సమక్షంలోనే చెర్రీ కేక్ కట్ చేశాడు. తర్వాత.. అంతా కలిసి విందు ఆరగించారు కూడా. ఇది చూసి మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

తమ హీరోలంతా.. ఎప్పుడూ ఇలాగే కలిసి మెలిసి ఉండాలని.. సినిమా ఫంక్షన్లలో కూడా కలిసి కనిపించాలని కోరుతున్నారు. మరి.. పవన్ అభిమానుల విజ్ఞప్తిని ఎలా రిసీవ్ చేసుకుంటాడో.. చూద్దాం.

English Title
Pawan Kalyan attends Ram Charan birthday celebrations at home

MORE FROM AUTHOR

RELATED ARTICLES