మీ ముందుకు వస్తున్నా.. ఆశీర్వదించండి

మీ ముందుకు వస్తున్నా.. ఆశీర్వదించండి
x
Highlights

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో తాను చేపట్టనున్న రాజకీయ యాత్రపై ట్విట్టర్ లో స్పందించారు. ఆసక్తికరంగా ఇందుకు...

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. త్వరలో తాను చేపట్టనున్న రాజకీయ యాత్రపై ట్విట్టర్ లో స్పందించారు. ఆసక్తికరంగా ఇందుకు తెలంగాణను వేదికగా చేసుకున్నారు. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం నుంచి తన రాజకీయ యాత్ర ప్రారంభిస్తానని పవన్ వెల్లడించారు. తెలుగు రాష్ర్టాల్లోని తన రాజకీయ యాత్ర ప్రారంభానికి ముందు మొదటగా స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకోనున్నట్లు పవన్ తెలిపారు. మీ ముందుకు వస్తున్నా.. ఆశీర్వదించండి' అంటూ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. తన అప్రహిత రాజకీయ యాత్రను తెలుగునేలపై పుణ్యస్థలమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభించబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

కొండగట్టు ఆంజనేయ స్వామి వల్లే.. తాను 2009 ఎన్నికల సమయంలో జరిగిన ప్రమాదం నుంచి బయటపడ్డానని పవన కళ్యాణ్ తెలిపారు. తమ కుటుంబ ఇలవేల్పు కూడా ఆంజనేయస్వామి కావడంతో తాను కొండగట్టును కేంద్రంగా ఎంచుకునేందుకు కారణమని తెలిపారు. తాను చేపట్టనున్న రాజకీయ యాత్రలో ప్రజల సమస్యలపై అధ్యయనం చేసి అవగాహన పెంచుకుంటానని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
2019 ఎన్నికలకు తాము సిద్ధమవుతున్నామని...వచ్చే ఏడాది ఇందుకు తగిన పూర్తి కార్యాచరణను ప్రకటిస్తానని కొద్దికాలం క్రితం పవన్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవన్ తన రాజకీయ యాత్రకు సిద్ధమైనట్లు ప్రకటించడం ఆసక్తిగా మారింది. మరి తన రాజకీయ యాత్రను పవన్ ఏ రోజున కొండగట్టు ఆలయం నుంచి ప్రారంభిస్తారన్నది వేచిచూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories