వాట్సాప్‌కు పోటీగా పతంజలి కొత్త మెసేజింగ్ యాప్..!

Submitted by arun on Thu, 05/31/2018 - 12:15
baba ramdev

ప్రఖ‌్యాత మెసేజింగ్ యాప్ వ్యాట్సాప్ కు గట్టి పోటీ ఎదురుకానుంది. ప్రఖ్యాత యోగా గురువు రాందేవ్ బాబా కింబో అనే పేరుతో ఓ సరికొత్త మెసేజింగ్ యాప్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు. సరికొత్త ఫీచర్లతో ఉన్న ఈ యాప్ ను ఇప్పటికే వేలాది మంది డౌన్ లోడ్ చేసుకుని వినియోగిస్తున్నారు.

యోగా గురువు రాందేవ్ బాబా తన నెట్ వర్క్ ను మరింత విస్తరిస్తున్నారు. పతంజలి ఆయుర్వేద్ ద్వారా ఇప్పటికే దేశ వ్యాప్తంగా 5 వేల ఔట్ లెట్ల ద్వారా పతంజలి ఉత్పత్తులను విక్రయిస్తున్న పతంజలి గ్రూప్ ...సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండాలని నిర్ణయించింది. కొంబో అనే సరికొత్త యాప్ ను విడుదల చేసింది. ఇందులో వాట్సాప్ లో ఉన్న ఫీచర్లతో పాటు మరికొన్నిఫీచర్లు అదనంగా ఉండేలా రూపొందించారు. యోగా గురు రాందేవ్ బాబా ఈ యాప్‌ను ఆవిష్కరించిన అనంతరం పతంజలి ప్రతినిధి ఎస్‌కే తిజారావాలా ట్వీట్ చేశారు. ‘ఇకపై భారత్ మాట్లాడుతుంది. వాట్సాప్‌కు గట్టి పోటీ ఎదురుకాబోతోంది. ఈ స్వదేశీ యాప్‌ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి నేరుగా డౌన్ లోడ్ చేసుకోండి’ అంటూ తిజారావాలా ట్వీట్‌లో పేర్కొన్నారు.

కాగా, ప్రభుత్వ రంగ సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)తో కలిసి స్వదేశీ సమృద్ధి సిమ్ కార్డులను పతంజలి విడుదల చేసింది. రూ.144కే అపరిమిత వాయిస్ కాల్స్, ఎస్సెమ్మెస్‌లు, డేటా అందించనున్నట్టు ప్రకటించింది. అంతేకాదు పతంజలి సిమ్ యూజర్లకు ఆ సంస్థ ఉత్పత్తులపై పదిశాతం రాయితీ కూడా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఇప్పుడు మైక్రోబ్లాగింగ్ సైట్ వాట్సాప్‌ను ఎదుర్కొనేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయటం విశేషం.

English Title
patanjali group launched kimbho messaging app

MORE FROM AUTHOR

RELATED ARTICLES