పార్లమెంటు ఆవరణలో తెదేపా, వైకాపా ఆందోళనలు

Submitted by arun on Mon, 03/05/2018 - 11:21
ap special status

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు అమలు చేయాలంటూ తెలుగుదేశం, వైకాపా దిల్లీలో ఆందోళనలు చేపట్టాయి. పార్లమెంటు ఆవరణలోని దిల్లీలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు చేతబట్టి ఏపీకి న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఏలూరు ఎంపీ మాగంటి బాబు, వెంకటేశ్వరస్వామి విగ్రహం, పవిత్ర గ్రంధాలు పట్టుకుని ఆందోళనలో పాల్గొన్నారు. మరోవైపు పార్లమెంటు స్ట్రీట్‌ వైకాపా ఎంపీలు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని, విభజన హామీలు వెంటనే నెరవేర్చాలని నినాదాలు చేస్తున్నారు.
 

English Title
Parliament's Budget Session 2018 Begins

MORE FROM AUTHOR

RELATED ARTICLES