తీవ్ర ఒత్తిడిలో ఆసిఫా తల్లిదండ్రులు...గ్రామాన్ని వదలిపెట్టిన కుటుంబం

Submitted by arun on Mon, 04/16/2018 - 13:11
 Asifa

జమ్ముకశ్మీర్ బాలిక హత్య, హత్యాచారం ఒకవైపు దేశాన్ని కుదిపేస్తోంది. కానీ మరోవైపు జరుగుతున్న పరిణామాలు ఆ కుటుంబాన్ని చిత్రవధ చేస్తున్నాయి. ఎనిమిదేళ్ల చిన్నారిని దారుణంగా పోగొట్టుకొని కుమిలిపోతున్న కుటుంబానికి వివిధ వర్గాల నుంచి వస్తున్న సమస్యలు మరింత క్షోభకు గురిచేస్తున్నాయి. 

జమ్మూ కశ్మీర్‌ కథువాలోని రసానా గ్రామంలో పశువులు మేపుకునే కుటుంబం ఆసిఫా తల్లిదండ్రులది. ఆసిఫాను అత్యంత క్రూరంగా అత్యాచారం, హత్య చేసిన తర్వాత ఆ కుటుంబం కుమిలిపోయింది. న్యాయం కోసం పోరాటానికి సిద్ధమైతే పెద్దవాళ్ల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. దీంతో ఊరినే విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు ఆసిఫా తండ్రి అమ్జాద్ అలీ. 

పశువులు మేపుకొని బతికే తమలాంటివాళ్లు పెద్దవాళ్లమీద ఎలా పోరాటం చేయగలరని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఆసిఫా తండ్రి అమ్జాద్. ఇప్పటికే తమ పశువులను కొన్నిటిని కోల్పోయిన ఆ కుటుంబం మిగిలినవాటిని కాపాడుకోడానికి ఊరినే వదిలివెళ్లాలని నిర్ణయించుకుంది. దీంతో తమ పశువులను వెంటబెట్టుకొని రసానా గ్రామానికి 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న కిస్ట్వార్‌కు 9 రోజుల పాటు ప్రయాణించి చేరుకున్నారు. రసానాలో ఉంటే తమ కూతురు జ్ణాపకాలు, ఆమెకు జరిగిన దారుణం అనుక్షణం గుర్తుకువచ్చి కుమిలిపోతున్నామని ఆసిఫా తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆసిఫాకు న్యాయం జరిగేంతవరకు రసానా గ్రామంలో అడుగుపెట్టమని తేల్చిచెప్పారు. 

English Title
The parents of the eight-year-old don’t want to return to Kathua

MORE FROM AUTHOR

RELATED ARTICLES