పేదింటి అబ్బాయి, పెద్దింటి అమ్మాయి

Submitted by arun on Fri, 09/14/2018 - 12:27
'Paper Boy' Movie

పేదింటి అబ్బాయి, పెద్దింటి అమ్మాయి,

ప్రేమలే కదా సిన్మాకి పునాది రాయి,

ఆ కోవలోనే పపెర్ బాయ్  వచ్చెనోయి,

ఫీల్ గుడ్ కోసమైతే మాత్రం ఒకే భాయి. శ్రీ.కో. 


సినిమా చరిత్రలో ఎక్కువ కథలు పేదింటి అబ్బాయి, పెద్దింటి అమ్మాయి ప్రేమలో పడటం… పెద్దలు అడ్డు నిలవటం తోనే వచ్చాయి, వస్తున్నాయి, వస్తాయి కూడా... అలాంటి దారిలో వచ్చిన సినిమానే ‘పేపర్ బాయ్”. దర్శకుడు కథ ఎంచుకున్న తీరు కొంచం కారం, ఉప్పు, మసాలా తగ్గి ఉన్నా కథనం మెప్పించింది. హీరో, హీరోయిన్ ఇష్టపడే తీరు వారి మధ్య మాటలు  కొంత అలరిస్తాయి. అయితే సినిమాలో కామెడీ సీన్స్ సినిమా యొక్క ఫీల్ గుడ్ ఫాక్టర్ని దెబ్బతీసేలా ఎందుకు పెట్టారో అర్ధం మాత్రం అవ్వదు. సంపత్ నంది రచనా సహకారం సినిమాకు బాగానే హెల్ప్ అయ్యిందని చెప్పొచ్చు. దర్శకుడు జయశంకర్ మొదటి ప్రయత్నంగా వచ్చిన పేపర్ బాయ్ సినిమా అంచనాలను అందుకోలేదు. అయితే రాబోయ్ సినిమాల పోటిని తట్టుకొని  ఈ సినిమా నిలబడితే బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా ఫలితం ఉంటుంది. కథ, కథనాల్లో సంపత్ నంది ఇంకా అలోచించి కథని వండితే బాగుండేది అనిపించింది.

English Title
'Paper Boy' Movie

MORE FROM AUTHOR

RELATED ARTICLES