బాలికపై అత్యాచారం: కూతురితో కలిసి యాంకర్‌..

Submitted by arun on Thu, 01/11/2018 - 16:46
anchor Kiran Naz

ఛానెల్‌లో న్యూస్ రీడర్‌గా పనిచేస్తోన్న ఓ యువతి తన కూతురిని ఒడిలో కూర్చోబెట్టుకుని లైవ్‌లో వార్తలు చదివిన ఘటన పాకిస్థాన్‌లోని సామా టీవీ స్టూడియోలో చోటు చేసుకుంది. ఇటీవల ఓ బాలికపై దుండగులు అత్యాచారం చేసి, దారుణంగా హత్యచేశారు. అనంతరం ఆమె మృతదేహాన్ని వీధుల్లో పడేశారు. అందుకు ఓ తల్లిగా నిరసన తెలుపుతూ న్యూన్ రీడర్ కిరణ్ నాజ్ లైవ్‌లో వార్తలు చదువుతూ బాలిక కిడ్నాప్ గురించి వివరించింది.

కిరన్‌ నాజ్‌ అనే యాంకర్‌ తన కూతురిని ఒడిలో కూచుబెట్టుకొని న్యూస్‌ బులిటెన్‌ను ప్రారంభించింది. 'ఈ రోజు నేను కిరన్‌ నాజ్‌ను కాదు. ఒక అమ్మను.. అందుకే నా కూతురితోపాటు ఇక్కడ కూర్చున్నాను' అని ఆమె న్యూస్‌ ప్రారంభించారు. దేశంలో మహిళలు, బాలికలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను తీవ్రంగా ఖండిస్తూ ఆమె భావోద్వేగంగా 1.50 నిమిషాలపాటు మాట్లాడారు. 'చిన్న శవపేటికలే అత్యంత బరువైనవనే మాట ఎంతో సత్యం. ఆ చిన్నారి శవపేటిక బరువును ఇప్పుడు యావత్‌ పాకిస్థాన్‌ మోస్తోంది' అని నాజ్‌ పేర్కొన్నారు. పంజాబ్‌ ప్రావిన్స్‌లోని కసుర్‌లో ఎనిమిదేళ బాలికపై కిరాతకంగా అత్యాచారం, హత్య జరిగిన ఘటన తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. ప్రావిన్స్‌ అంతటా ఈ ఘటనకు వ్యతిరేకంగా హింసాత్మక ఆందోళనలు చోటుచేసుకున్నాయి. భారత సరిహద్దుకు అతికొద్దీ దూరంలోనే కసూర్‌ పట్టణం ఉంది.
 

English Title
Pakistani anchor goes on air with daughter to protest minor's brutal rape and murder

MORE FROM AUTHOR

RELATED ARTICLES