పాకిస్థాన్‌ మరోసారి తన నీచపు బుద్థిని చాటుకుంది

Submitted by arun on Mon, 12/25/2017 - 18:22
Jadhav Family

పాకిస్థాన్‌ మరోసారి తన నీచపు బుద్థిని చాటుకుంది. కుల్‌భూషణ్‌ జాదవ్‌ పై తన నీచ సంస్కృతిని చాటుకుంది. దేశద్రోహం, గూఢచర్యం ఆరోపణలతో పాక్‌ జైళ్లో మగ్గుతున్న జాదవ్‌ను చూసేందుకు మాత్రమే అనుమతిచ్చిన పాక్‌ సర్కార్‌ ఆత్మీయుల మధ్య అడ్డుగోడలు ఏంటని పలువురు మండిపడుతున్నారు.

ఎట్టకేలకు 22 నెలల తర్వాత కుల్‌భూషణ్‌ జాదవ్‌ భార్య, తల్లిని కలిశాడు. భారత్ నుంచి దుబాయ్ మీదుగా ఇస్లామాబాద్ చేరుకున్న జాదవ్ తల్లి, భార్య పాకిస్థాన్ విదేశాంగ శాఖ కార్యాలయంలో జాదవ్‌ను కలిశారు. అరగంటసేపు భేటీ అయిన అతని భార్య, తల్లి కుల్‌భూషణ్‌‌ను చూడగానే ఉద్వేగానికి లోనయ్యారు. 

అయితే 22 నెలల విరామం అనంతరం జాదవ్‌ ఆత్మీయుల ముఖం చూడగలిగినా వారి స్పర్శకు మాత్రం నోచుకోలేదు. జాదవ్ తల్లి, భార్య ఓ సోఫాలో కూర్చోగా మరోవైపు కుల్‌భూషణ్ కూర్చున్న ఫొటోలను పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ట్వీట్ చేశారు. ఆ ఫొటోలను చూస్తే వారి మధ్య ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే అద్దాన్ని అడ్డుగా ఉంచినట్లు అర్థమవుతోంది. వారు మాట్లాడుకోవడానికి వీలుగా ఇరువైపులా స్పీకర్ టెలీఫోన్ ఉంచారు.

మానవతా దృక్పథంతో కుల్‌భూషణ్‌ను కలిసేందుకు అనుమతి ఇచ్చామని చెబుతోన్న పాక్ ఆత్మీయుల మధ్య ఇలా అడ్డుగోడలు ఉంచడం ఏం మానవత్వమని పలువురు మండిపడుతున్నారు. అయితే దీనిపై పాక్‌ బదులిచ్చింది. దీనిని కాన్సులర్ యాక్సెస్ అంటూ అక్కడి మీడియా ప్రచారం చేస్తోంది. దీనిపై స్పందించిన భారత్‌ నూటికి నూరు పాళ్లు ఇది కాన్సులర్ యాక్సెస్ కాదని వాదించింది. పూర్తిగా మానవతావాదంతో ఈ యాక్సెస్‌ను కల్పించామన్న పాక్‌ ఒకవేళ తాము ఇదే స్థితిలో ఉంటే భారత్‌ కూడా తమపట్ల దయ చూపించదని పాకిస్థాన్‌ ఆరోపించింది. ముహ్మద్ అలీ జిన్నా జయంతి రోజున మానవతా దృక్పథంతో జాదవ్‌ను అతని తల్లి, భార్య కలిసేందుకు అనుమతిస్తున్నట్లు తెలిపిన పాక్ ప్రభుత్వం- కుటుంబసభ్యులతో గ్లాస్ పేన్ అంటే ఇరువురి మధ్యలో గ్లాస్ ద్వారా మాట్లాడిన కులభూషణ్ వీడియోను అక్కడి అధికారులు రికార్డ్ చేశారు. 

English Title
Pakistan Tweets Jadhav Family Meeting

MORE FROM AUTHOR

RELATED ARTICLES