పాకిస్తాన్ అదుపులో 28 మంది ఆంధ్రా జాలర్లు..

పాకిస్తాన్ అదుపులో 28 మంది ఆంధ్రా జాలర్లు..
x
Highlights

బతుకు తెరువు కోసం వలస వెళ్లిన 28 మంది ఆంధ్రా జాలర్లు పాకిస్థాన్‌ కోస్టు గార్డు చెరలో చిక్కుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు...

బతుకు తెరువు కోసం వలస వెళ్లిన 28 మంది ఆంధ్రా జాలర్లు పాకిస్థాన్‌ కోస్టు గార్డు చెరలో చిక్కుకున్నారు. శ్రీకాకుళం, విజయనగరం, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన మత్స్యకారులు అరేబియా సముద్రంలో చేపల వేటకు వెళ్లి పాకిస్థాన్ తీర ప్రాంత భద్రతా దళం చేతిలో బందీగా మారారు. పాక్ అరెస్టు చేసిన వారిలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 20 మంది, విజయనగరం జిల్లాకు చెందిన నలుగురు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన నలుగురు ఉన్నారు. చేపల వ్యాపారం చేసే ఓ కాంట్రాక్టర్ దగ్గర గుజరాత్‌లో పని చేస్తున్న ఈ 28 మంది పొరబాటున పాకిస్థాన్‌ సముద్ర జలాల్లోకి వెళ్లిపోయారు. దీంతో వారిని ఆ దేశ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వీరంతా ప్రస్తుతం కరాచీలో ఉన్నట్లు తెలుస్తోంది.

28 మంది జాలర్లు పాకిస్తాన్ చేతిలో బందీ అయ్యారన్న సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారు. నిద్రాహారాలు మాని తమవారి క్షేమ సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించాలని వేడుకొంటున్నారు. జాలర్ల అరెస్టు సమాచారాన్ని మంత్రి కళా వెంకట్రావు సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్ళారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ భవన్ అధికారులతో మాట్లాడారు మత్స్యకారులను తిరిగి స్వదేశానికి రప్పించే చర్యలు తీసుకోవాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుతం ఢిల్లీలోని ఏపీ భవన్‌ అధికారులు పాకిస్తాన్‌లోని భారత హైకమిషనర్‌తో మాట్లాడుతున్నారు. వారు పాక్ విదేశాంగ శాఖతో సంప్రదింపులు జరుపుతున్నారు. గతంలో భారత జాలర్లు ఇలానే పాకిస్తాన్‌కు పట్టుబడితే రెండేళ్ల తరవాత గానీ స్వదేశానికి రాలేకపోయారు. గత ఘటనల నేపథ్యంలో జాలర్ల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories