ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు...ఖరీదు రూ.121 కోట్లు

Submitted by arun on Wed, 07/25/2018 - 13:12
Pagani’s Zonda

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు మార్కెట్ లోకి దూసుకొచ్చింది. ఖరీదైన కారంటే 50 కోట్లు వంద కోట్లో కాదు ఈ కారు ఖరీదైన కారు ధర అక్షరాల 121 కోట్లు. రోల్స్‌ రాయిస్‌ లంబోర్గిని జాగ్వార్‌ విలాస కార్లను తలదన్నుతో మరో కొత్తబ్రాండ్ వచ్చేసింది  అదే పగాణీ జోండా  వస్తూవస్తూనే ప్రపంచంలో అత్యంత ఖరీదైన రికార్డు నమోదు చేసుకుంది.

ఇటలీకి చెందిన ప్రముఖ స్పోర్ట్స్‌ కార్ల తయారీ సంస్థ పగాణి ఆటోమొబిలి ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారును రూపొందించింది. ఇప్పటి వరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేస్తూ పగాణి జోండా హెచ్పీ కారు ఏకంగా 121 కోట్ల రూపాయలు పలుకుతోంది.  ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారుగా ఇది రికార్డు సృష్టించింది. పగాణీ సంస్థ ఈ మోడల్‌లో మూడు కార్లను మాత్రమే తయారుచేసింది. వాటిలో ఒకటి కంపెనీ యజమాని తన సొంతానికి వాడుతున్నారు. ఇక మిగిలిన రెండు కార్లను ఇలా మార్కెట్ లో పెట్టగానే అలా హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.

ధరకు తగ్గట్టుగానే ఇందులోని ఫీచర్లు కూడా అబ్బురపరుస్తున్నాయి. ముఖ్యంగా కళ్లు తిప్పుకోనివ్వని ఫినిషింగ్ తో ఆకట్టుకుంటోంది. ఇక ఈ కారు గంటకు గరిష్టంగా 355 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే మన హైదరాబాద్ నుంచి విజయవాడకు గంట లోపులోనే చేరుకోవచ్చు. ఈ కారు ప్రయాణం మొదలైందంటే కేవలం 3 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. 

కార్బన్ టైటానియం మిశ్రమంతో తయారైన ఈ కారు 1250 కిలోల బరువు ఉంటుంది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఖరీదైన కారుగా రోల్స్‌ రాయిస్‌ స్వెప్‌టెయిల్‌ 84 కోట్లు ఉండగా ఇప్పుడు ఆ రికార్డును బద్దలుకొడుతూ పగాణీ జోండా 121 కోట్ల రూపాయలతో ఫస్ట్ ప్లేస్ లో నిలిచింది.

English Title
Pagani’s Zonda HF Barchetta will cost you Rs 120 crores without taxes

MORE FROM AUTHOR

RELATED ARTICLES