'ప‌ద్మావ‌తి' ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్స్‌ అదుర్స్‌

Submitted by nanireddy on Thu, 09/21/2017 - 11:54

సంజ‌య్‌లీలా భ‌న్సాలీ సినిమాలంటే క‌ళాత్మ‌కతకి పెట్టింది పేరు. కెరీర్ ఆరంభం నుంచి ఆయ‌న శైలే అంత‌. ప్ర‌స్తుతం సంజ‌య్‌ తెర‌కెక్కిస్తున్న చిత్రం 'ప‌ద్మావ‌తి'. దీపికా ప‌దుకునే టైటిల్ రోల్‌లో న‌టిస్తున్న‌ ఈ సినిమాలో ర‌ణ‌వీర్ సింగ్, షాహిద్ క‌పూర్ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌ పోస్ట‌ర్స్‌ని ఇవాళ విడుద‌ల చేశారు. ప‌ద్మావ‌తిగా దీపికా ఫ‌స్ట్‌లుక్ చూసిన‌వారంతా అదుర్స్ అంటున్నారు.

'గోలియోంకీ రాస్‌లీలా రామ్‌లీల‌', 'బాజీరావ్ మ‌స్తానీ' త‌రువాత ర‌ణ‌వీర్ సింగ్‌, దీపికా ప‌దుకునే కాంబినేష‌న్‌లో సంజ‌య్‌ తెర‌కెక్కిస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది. కెరీర్‌లో ఎప్పుడూ లేని విధంగా ఒకే జంట‌తో వ‌రుస‌గా మూడు సినిమాలు తీసి సంజ‌య్ వార్త‌ల్లో నిలిచాడు. వ‌యాకామ్ 18 మోష‌న్ పిక్చ‌ర్స్‌, భ‌న్సాలీ ప్రొడక్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని డిసెంబ‌ర్ 1న విడుద‌ల చేయ‌నున్నారు. వాస్త‌వానికి ఈ సినిమాని మొద‌ట న‌వంబ‌ర్ 17న విడుద‌ల చేయాల‌నుకున్నారు. కొన్ని సాంకేతిక కార‌ణాల వ‌ల్ల వాయిదా వేశార‌ని తెలిసింది.

సంజ‌య్ లీలా భ‌న్సాలీనే పాట‌ల‌కు సంగీత‌మందించ‌గా..  బ‌పి-టుటుల్ నేప‌థ్య సంగీత‌మందించ‌నున్నారు. 'ప‌ద్మావ‌తి'లో సోనూ సూద్‌, అదితిరావ్ హైద‌రి కీల‌క పాత్ర‌లు పోషించారు. రాణి ప‌ద్మిని, అల్లావుద్దీన్ ఖిల్జీ, రాణా రావ‌ల్ ర‌త‌న్ సింగ్ చుట్టూ తిరిగే చారిత్రాత్మ‌క క‌థ‌తో 'ప‌ద్మావ‌తి' తెర‌కెక్కుతోంది. శౌర్యానికి, సౌంద‌ర్యానికి ప్ర‌తీక‌గా రాణి ప‌ద్మిని పాత్ర ఉంటుంది.

English Title
'padmavathi' firstlook posters just superb

MORE FROM AUTHOR

RELATED ARTICLES