ప‌ద్మావ‌తి.. దీపికాకో కానుక‌

ప‌ద్మావ‌తి.. దీపికాకో కానుక‌
x
Highlights

తెలుగులో విజ‌యం సాధించిన 'మ‌న్మ‌థుడు' చిత్రం క‌న్న‌డ‌లో 'ఐశ్వ‌ర్య' పేరుతో రీమేక్ అయితే.. అందులో టైటిల్ రోల్‌లో సంద‌డి చేసింది నేటి బాలీవుడ్ టాప్...

తెలుగులో విజ‌యం సాధించిన 'మ‌న్మ‌థుడు' చిత్రం క‌న్న‌డ‌లో 'ఐశ్వ‌ర్య' పేరుతో రీమేక్ అయితే.. అందులో టైటిల్ రోల్‌లో సంద‌డి చేసింది నేటి బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా ప‌దుకునే. ఉపేంద్ర హీరోగా న‌టించిన ఆ సినిమా 2006లో విడుద‌లై మంచి విజ‌య‌మే సాధించింది. అయితే.. దీపికా న‌ట‌జీవితాన్ని మార్చింది మాత్రం 2007లో విడుద‌లైన 'ఓం శాంతి ఓం'. షారుఖ్ ఖాన్ హీరోగా న‌టించిన ఈ చిత్రానికి ప‌రా ఖాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. 2007, న‌వంబ‌ర్ 9న విడుద‌లైన ఈ చిత్రం ఘ‌న విజ‌యం సాధించ‌డంతో.. దీపికా ఇక వెన‌క‌కు తిరిగి చూడాల్సిన‌ అవ‌స‌రం రాలేదు.

హిందీలో టాప్ హీరోయిన్ అనిపించుకోవ‌డ‌మే కాకుండా.. హాలీవుడ్‌లోనూ సినిమా చేసే స్థాయికి ఎదిగింది దీపికా. ఇదిలా ఉంటే.. ఈ న‌వంబ‌ర్ 9కి దీపికా బాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చి ప‌దేళ్లు పూర్త‌వుతోంది. స‌రిగ్గా ఈ సంద‌ర్భంలోనే ఆమె కొత్త చిత్రం 'ప‌ద్మావ‌తి' న‌వంబ‌ర్ 17న విడుద‌ల‌కి సిద్ధ‌మైంది. అగ్ర ద‌ర్శ‌కుడు సంజ‌య్ లీలా భ‌న్సాలీ రూపొందిస్తున్న ఈ చిత్రం.. ప‌దేళ్ల కెరీర్‌ని పూర్తిచేసుకుంటున్న సంద‌ర్భంలో దీపికాకి ఓ కానుక‌గా భావించ‌వ‌చ్చేమో. 'ప‌ద్మావ‌తి'లో ర‌ణ‌వీర్ సింగ్‌, షాహిద్ క‌పూర్‌, అదితిరావ్ హైద‌రీ ఇత‌ర‌ ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories