అసలు బృందావన ప్రవేశం ఏంటి? మహాసమాధి ఎందుకు చేస్తారు?

Submitted by arun on Thu, 03/01/2018 - 12:58
Saraswathi Mahasamadhi

జయేంద్ర సరస్వతి మహాసమాధితో కాంచీపురంలోని మఠం శోకసంద్రమైంది. మఠం నిర్వాహకులు, భక్తులు స్వామిని తలచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. నుదుట విభూతి, కుంకుమతో.. చేతులు జోడించి.. ధ్యానముద్రలో ఉన్న స్వామి పార్థివదేహాన్ని చూసి అశ్రుతర్పణం చేశారు. అసలు బృందావన ప్రవేశం ఏంటి? మహాసమాధి ఎందుకు చేస్తారు? 

ఉదయం 10 గంటలకు జయేంద్ర పార్థివదేహం మఠంలోని శ్రీ చంద్రశేఖరేంద్ర సమాధి పక్కనే బృందావన ప్రవేశం చేస్తింది. అంతకు ముందు మఠం ఆచారం ప్రకారం జయేంద్ర సరస్వతి స్వామి ముక్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు జరిపి అంతిమసంస్కారాలు పూర్తి చేశారు. మంటపం ముందున్న గదిలో కూర్చుని నిత్యం ఆయన భక్తులకు ఆశీస్సులు అందజేసిన చోటే పార్థివ దేహాన్ని మహాసమాధి చేశారు. 

కంచి మఠం ఆచారం ప్రకారం అక్కడి సంప్రదాయాల ప్రకారం బృందావన ప్రవేశ కార్యక్రమం భక్తుల అశృతర్పణాల మధ్య సాగింది. ఉదయం ఏడు గంటలకు అభిషేకం, తర్వాత ఆరతి కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత దేశం నలుమూలల నుంచీ వచ్చిన పండితులు నాలుగు వేదాల్లోని మంత్రాలను పఠించారు. 

మహా పెరియవ చంద్రశేఖరేంద్ర సరస్వతి పార్థివదేహాన్ని ఖననం చేసిన బృందావనానికి అనుబంధంగా ఉన్న హాల్‌లో జయేంద్ర స్వామి పార్థివదేహాన్ని వెదురుబుట్టలో ఉంచారు. లాంఛనంగా కపాలమోక్షం కార్యక్రమం నిర్వహించి మహాసమాధి చేస్తారు. సమాధిని మూలికలు, వస, ఉప్పు, చందనపు చెక్కలతో నింపి....నందకుమార్‌, శివ స్థపతులు సమాధిని నిర్మించారు. అనంతరం దానిపై తులసి మొక్కను పెట్టారు. 

 ఆధ్యాత్మిక జీవనం గడిపేందుకు సన్యాసులు, బ్రహ్మచారులు ఉండే మఠంలో దేవతను ప్రతిష్ఠించిన తర్వాత అది పీఠంగా ప్రభవిస్తుంది. అలాంటి పీఠానికి అధిపతిగా ఉన్న వారు ఆజన్మ బ్రహ్మచారులు. మఠం నియమం ప్రకారం... హిందూ సంప్రదాయం, సంస్కారం ప్రకారం... ఆజన్మ బ్రహ్మచారులు చనిపోతే వారిని సమాధి చేస్తారే కానీ... దహన సంస్కరాలు నిర్వహించరు. అందులో అద్వైతామృత ప్రచారకర్తగా ఉన్న కంచి స్వాములను ఎట్టి పరిస్థితుల్లోనూ దహన వాటికికు తరలించరు. బతికున్న కాలంలోనే నడిచే దైవంగానే విశేష గౌరవ మర్యాదలు అందుకున్న జయేంద్ర సరస్వతిని... ముక్తి పొందిన తర్వాత దైవంతో సమానంగా కొలుస్తారు శిష్యులు. అందుకే తాను నడయాడిన స్థలంలోనే, తాను అనంతకోటి భక్తులకు ఆశీర్వచనాలు అందించిన ప్రాంతంలోనే జయేంద్ర సరస్వతి స్వామిని మహాసమాధి చేశారు. ఇదే ఆనవాయితీ. ఇదే మఠ సంప్రదాయం. 

English Title
Package on Jayendra Saraswathi Mahasamadhi

MORE FROM AUTHOR

RELATED ARTICLES