బరిలో 1825 మంది అభ్యర్థులు...8చోట్ల చతుర్ముఖ పోటీ, 36 చోట్ల త్రిముఖ పోరు

x
Highlights

ఎన్నికల సంగ్రామంలో ఢీ అంటే ఢీ అనేది ఎవరో తేలిపోయింది. ఎవరెవరి మధ్య పోటీ ఉంటుందో స్పష్టమైంది. నామినేషన్ల తిరస్కరణలు, ఉపసంహరణలు ముగియడంతో బరిలో నిలిచిన...

ఎన్నికల సంగ్రామంలో ఢీ అంటే ఢీ అనేది ఎవరో తేలిపోయింది. ఎవరెవరి మధ్య పోటీ ఉంటుందో స్పష్టమైంది. నామినేషన్ల తిరస్కరణలు, ఉపసంహరణలు ముగియడంతో బరిలో నిలిచిన అభ్యర్థులెవరో క్లారిటీ వచ్చేసింది. తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజక వర్గాల్లో మొత్తం.. 18వందల 25 మంది పోటీలో నిలిచారు. రాష్ట్రవ్యాప్తంగా 3వేల 583 నామినేషన్లు దాఖలు కాగా.. తిరస్కరణలు, ఉపసంహరణలో 17వందల 58 మంది పోటీ నుంచి తప్పుకున్నారు. సగటున ఒక్కో నియోజకవర్గం నుంచి 15 మంది బరిలో ఉన్నారు. గత ఎన్నికల్లో సగటున ఒక్కో సెగ్మెంట్ నుంచి 13 మంది బరిలో ఉండగా.. ఈసారి మరో ఇద్దరు అభ్యర్ధులు పెరిగారు. అత్యధికంగా మల్కాజిగిరిలో 42 మంది పోటీ చేస్తున్నారు. ఎల్బీనగర్‌, ఉప్పల్‌లలో 35 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఖైరతాబాద్‌లో 32, అంబర్‌పేటలో 31 మంది పోటీ చేస్తున్నారు.

అత్యధిక అభ్యర్థులు బరిలో ఉన్న మొదటి ఐదు నియోజకవర్గాలూ గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనే ఉన్నాయి. అతి తక్కువ సంఖ్యలో అభ్యర్థులు బరిలో నిలిచింది బాన్సువాడ నియోజకవర్గం. ఇక్కడ కేవలం ఆరుగురే పోటీలో ఉన్నారు. నర్సాపూర్‌, బోథ్‌, జుక్కల్‌లలో ఏడుగురు.. నిర్మల్‌, ఆర్మూరు, ఎల్లారెడ్డిల్లో 8 మంది పోటీపడుతున్నారు. మహాకూటమి అభ్యర్ధుల మధ్య నాలుగు చోట్ల స్నేహపూర్వక పోటీ జరుగుతోంది. వరంగల్‌ ఈస్ట్, ఆసిఫాబాద్‌, ఖానాపూర్‌, దుబ్బాక స్థానాల్లో టీజేఎస్‌, కాంగ్రెస్‌.. రెండు పార్టీల అభ్యర్థులూ బరిలో నిలిచారు. ఇక, టీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలు మొత్తం 119 సీట్లలోనూ బరిలోకి దిగగా.. మహా కూటమి నుంచి కాంగ్రెస్‌ 99 స్థానాల్లోనూ, టీడీపీ 13 సీట్లలోనూ, టీజేఎస్‌ 8 చోట్ల, సీపీఐ మూడు స్థానాల్లో పోటీ చేస్తోంది. బీఎల్‌ఎఫ్‌ నుంచి 109 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. మొత్తం మీద 28 పార్టీలు అసెంబ్లీ బరిలో ఉన్నాయి.

అటు మహా కూటమి, ఇటు టీఆర్‌ఎస్‌ నుంచి ముఖ్య నేతలు బరిలోకి దిగడంతో తిరుగుబాటు అభ్యర్థులు తమ తమ నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్‌లో 13 మంది పోటీలో ఉన్నారు. జానారెడ్డి పోటీ చేస్తున్న నాగార్జునసాగర్‌లో 14 మంది బరిలో నిలిచారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పోటీ చేస్తున్న హుజూర్‌నగర్‌లో 16 మంది పోటీలో ఉన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పోటీ చేస్తున్న హుస్నాబాద్‌లో 15 మంది బరిలో నిలిచారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ పోటీ చేస్తున్న ముషీరాబాద్‌లో 26 మంది పోటీలో ఉన్నారు. అక్బరుద్దీన్‌ పోటీ చేస్తున్న చాంద్రాయణగుట్టలో 15 మంది పోటీపడుతున్నారు. దీంతో ఈసారి తెలంగాణలో ప్రముఖులు పోటీ చేసే స్థానాలతో పాటు చాలా నియోజకవర్గాల్లో పోటీ రసవత్తరంగా మారింది.

Show Full Article
Print Article
Next Story
More Stories