ఓయూలో విద్యార్ధుల ఆందోళన

ఓయూలో విద్యార్ధుల ఆందోళన
x
Highlights

ఓయూలో విద్యార్ధులు ఆందోళనకు దిగారు. నిరుద్యోగ జెఏసి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నిన్న విడుదల చేసిన పోలీస్ రిక్రూట్ మెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్...

ఓయూలో విద్యార్ధులు ఆందోళనకు దిగారు. నిరుద్యోగ జెఏసి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నిన్న విడుదల చేసిన పోలీస్ రిక్రూట్ మెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ లో అభ్యర్ధుల వయో పరిమితిని పెంచాలంటూ విద్యార్ధులు డిమాండ్ చేస్తున్నారు. ఓయూ లైబ్రరీ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు నిర్వహించిన ర్యాలీ లో విద్యార్ధులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం అభ్యర్ధుల వయో పరిమితిని 22 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలకు పెంచాలని, అదే విధంగా ఎస్సై అభ్యర్ధుల వయో పరిమితిని 25 నుంచి 31 సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నోటిఫికేషన్లు లేకపోవడం, గత SI పరీక్షలో ఇంగ్లిష్ మెరిట్ విధానం వల్ల చాలా మంది అభ్యర్ధులు నష్ట పోయారని విద్యార్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోలనకు దిగుతామని విద్యార్ధులు ప్రభుత్వానికి హెచ్చరించారు.

చిక్కడపల్లి లైబ్రరీ వద్ద విద్యార్దులు ఆందోళనకు దిగారు. నిన్న విడుదల చేసిన పోలీస్ రిక్రూట్ మెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ లో అభ్యర్ధుల వయో పరిమితిని పెంచాలంటూ విద్యార్ధులు డిమాండ్ చేశారు. దీంతో లైబ్రరీ ప్రాంగణం అంతా హడావుడిగా మారింది. పరిస్థితులు అదుపు తప్పకుండా ఉండేందుకు పోలీసులు రంగంలో దిగారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం వల్ల నాలుగు నుంచి ఐదు సంవత్సరాల సమయం కోల్పోయామని విద్యార్ధులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories