రూపాయికే కిలో ఉల్లిగ‌డ్డ‌లు...

రూపాయికే కిలో ఉల్లిగ‌డ్డ‌లు...
x
Highlights

దేశంలో నిత్యవసర వస్తువులకు ధరలు ఆకాశాన్నంటుతుంటే కర్నాటక రాష్ట్రంలో మాత్రం నిత్యవసర ధరలు కుప్పకూలిపోయాయి. తరుచు వాడుకునే ఉల్లిగడ్డ ధర కొండ నుండి...

దేశంలో నిత్యవసర వస్తువులకు ధరలు ఆకాశాన్నంటుతుంటే కర్నాటక రాష్ట్రంలో మాత్రం నిత్యవసర ధరలు కుప్పకూలిపోయాయి. తరుచు వాడుకునే ఉల్లిగడ్డ ధర కొండ నుండి దిగొచ్చింది. అక్కడ కేవలం ఒక్కరూపాయికే కిలో ఉల్లిగడ్డలు వస్తున్నాయి. దింతో వినియోగదారుడు సంతోషంగా ఉన్న రైతులు మాత్రం కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే కర్ణాటకలోనే అత్యధికంగా ఉల్లిని సాగుచేస్తున్నారు. హుబ్లీ, ధార్వాడ్‌, హ‌వేరి, గ‌డ‌గ్‌, బాల్కోట్‌, బెల్గావ్‌, దేవ‌న్‌గిరి, చిత్ర‌దుర్గ్ న‌గ‌రాల్లో అయితే 100 కిలోల బ్యాగ్‌ను వంద రూపాయ‌ల‌కు అమ్ముతున్నారు. గత వారం కింద క్వింట బ్యాగు రూ. 500లకు అమ్మగా ఇప్పుడు మాత్రం మరీ దారుణంగా రేట్లు పడిపోవడం ఉల్లిరైతులను ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ధ‌ర‌లు త‌గ్గిపోవ‌డంతో స‌మీప న‌గ‌రాల‌కు మ‌హారాష్ట్ర‌, క‌ర్నాట‌క నుంచి పెద్ద ఎత్తున ఉల్లిగ‌డ్డలు వ‌స్తున్నాయి. తమ గొడును ప్రభుత్వం పట్టించుకోని సరైన మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories