గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. పైలట్‌ మృతి

గాల్లో ఢీకొన్న రెండు విమానాలు.. పైలట్‌ మృతి
x
Highlights

రెండు చిన్న విమానాలు గాల్లోనే ఢీకొన్న ఘటన కెనడా రాజధాని ఒట్టావాకు సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సెస్నా ఎయిర్‌క్రాఫ్ట్‌ కంపెనీకి చెందిన చిన్న...

రెండు చిన్న విమానాలు గాల్లోనే ఢీకొన్న ఘటన కెనడా రాజధాని ఒట్టావాకు సమీపంలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో సెస్నా ఎయిర్‌క్రాఫ్ట్‌ కంపెనీకి చెందిన చిన్న ప్రయాణికుల విమానం ఒట్టావాకు పశ్చిమాన 30కిలోమీటర్ల దూరంలో పొలాల్లో ఒక్కసారిగా కుప్పకూలింది. ఇందులో పైలట్‌ మాత్రమే ప్రయాణించాడు. విమానం కుప్పకూలడంతో పైలట్‌ అక్కడికక్కడే మృతిచెందాడు అధికారులు తెలిపారు.

సెస్నా విమానం గాల్లో టర్బోప్రాప్‌ పైపర్‌ పీఏ-42 అనే మరో చిన్న విమానాన్ని ఢీకొట్టగా టర్బోప్రాప్‌ విమానం వెనక్కి మళ్లి తిరిగి ఒట్టావా అంతర్జాతీయ విమానాశ్రయంలో హుటాహుటినా దిగింది. ఈ విమానంలో ఉన్న ఓ ప్రయాణికుడు, పైలట్‌ సురక్షితంగా ఉన్నారు. విమానం ఢీకొట్టడం వల్ల తమ విమానం ల్యాండింగ్‌ గేర్‌ పాడైపోయిందని టర్బోప్రాప్‌ విమాన పైలట్‌ తెలిపాడు. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉందని, దర్యాప్తు చేపడుతున్నామని అధికారులు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories