ఎన్టీఆర్ - రాజీవ్ గాంధీలతో పోల్చుకున్న రేవంత్

ఎన్టీఆర్ - రాజీవ్ గాంధీలతో పోల్చుకున్న రేవంత్
x
Highlights

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళను ముఖ్యమంత్రి చేయాలని ఏఐసీసీ మహిళా అధ్యక్షురాలు సుస్మితాదేవ్ పెర్కోన్న విషయం తెలిసిందే. తాజాగా సీఎం రేసులో...

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళను ముఖ్యమంత్రి చేయాలని ఏఐసీసీ మహిళా అధ్యక్షురాలు సుస్మితాదేవ్ పెర్కోన్న విషయం తెలిసిందే. తాజాగా సీఎం రేసులో విజయశాంతి కూడా ఉన్నా ప్రచారం కూడా తెలిసిందే. అయితే ఇప్పటికే పురుషులలో కూడా తీవ్రపోటీ నెలకొంది. కాంగ్రెస్‌ల్లో ఇప్పటికే సినియర్ లీడర్లు ఉన్న విషయం తెలిసిందే కాగా ఈ నేపథ్యంలో సిఎం పదవి రేసులో నేనున్నంటూ ఇటివలే తెలుగుదేశం పార్టీ నుండి కాంగ్రెస్ గూటికి చేరిన రేవంత్ రెడ్డి తను కూడా సిఎం కూర్చికోసం తహతహలాడుతున్నాడు. నేడు రేవంత్ రెడ్డి మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో జర్నలిస్టులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంలో అధికార పార్టీ టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తునే నేను ముఖ్మమంత్రి అయితే ఏం చేయాలనుకుంటున్నారో చెప్పడానికి యత్నించాడు. ఓ పక్క కాంగ్రెస్ పెద్ద లీడర్లు సీఎం కావడానికి ఏం చేయాలో ఎత్తులకు పై ఎత్తులు వేస్తుంటే రేవంత్ రెడ్బి మాత్రం ముఖ్యమంత్రి అయితే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారు. సిఎం కావడానికి అనభవం అవసరం అంటరేమో అని ముందుగాలనే ఇద్దరు పెద్దమనుషులతో పోల్చుకున్నాడు. పరిపాలించడానికి అనుభవం లేదు ఇప్పటికే ఎన్టీఆర్, రాజీవ్ గాంధీ నిరూపించినట్లు వెల్లడించారు. అనుభవం లేకుండానే ఎన్టీఆర్ జనరంజక పాలన అందించారని, రాజీవ్ గాంధీ అనుభవం లేకనే దేశానికే తలమానికమైన నిర్ణయాలతో విప్లవాత్మక సంస్కరణలు తిసుకోచ్చారని తాను కూడా అలా చేయగలనని వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories