గతవారం పారిపోయి పెళ్లి చేసుకున్నాం...ఈ ఫోటో ఎలా లీకైందో : సమంత

Submitted by arun on Wed, 08/01/2018 - 16:20
Samantha

హీరోయిన్ సమంత ఏ మాయ చేసావే చిత్రం ద్వారా తెరంగేట్రం చేసి.. అగ్ర హీరోయిన్‌గా ఎదిగింది. తన తొలి హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లాడింది. పెళ్లికి తర్వాత కూడా సినిమాల్లో నటించి.. బంపర్ హిట్ రికార్డులను తన ఖాతాలో వేసుకుంది. ఇంకా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సమంత.. తాజాగా ఓ పిక్‌పై చేసిన కామెంట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. అది సమంత పెళ్లి ఫోటో. నాగచైతన్యకు బదులు అభిమాని తన ఫోటోను పెట్టుకున్నాడు. ఈ ఫోటో కాస్త వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంతను తన అభిమాని ఒకరు ఈ ఫోటోను షేర్ చేస్తూ.. 'సమంత ఏంటిది..? అని ప్రశ్నించాడు.

దానికి సమాధానంగా ఆమె 'గతవారం పారిపోయి వివాహం చేసుకున్నాం.. ఇది ఎలా లీక్ అయిందో తెలియదు. మాది తొలి చూపులోనే కలిగిన ప్రేమ' అంటూ ట్వీట్ చేశారు. సమంత ఇచ్చిన రిప్లైకు అభిమానులు నవ్వుకున్నారు. నీ చమత్కారానికి నవ్వు ఆపుకోలేకపోతున్నాం.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.  

Tags
English Title
OMG! Married Samantha eloped and tied the knot again, See leaked pic

MORE FROM AUTHOR

RELATED ARTICLES