పవన్ మ్యానియాతో తుడిచి పెట్టుకుపోయిన బాహుబలి రికార్డులు

Highlights

పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సినిమా ఆడియో విడుదలకాకుండా బాహుబలి రికార్డులను...

పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. సినిమా ఆడియో విడుదలకాకుండా బాహుబలి రికార్డులను కొల్లగొట్టనుందని ఫిల్మింనగర్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. డిసెంబర్ నెలలో విడుదల కానున్నఅజ్ఞాతవాసిని భారీ ఎత్తున విడుదల చేయాలని ఆ చిత్రయూనిట్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అమెరికా లో ఇప్పటికి వరకు ఏ సినిమా విడుదల కానీ 209 థియేటర్లలలో అజ్ఞాతవాసిని విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది.

అమెరికాలో ఇండియన్ సినిమాలు విడుదలను పరిశీలిస్తే జక్కన్న చెక్కిన శిల్పం ‘బాహుబలి2' 126 థియేటర్లు, చిరంజీవి నటించిన ‘ఖైదీ నంబర్‌ 150’ చిత్రం 74 థియేటర్లు, రజనీకాంత్ నటించిన ‘కబాలి’ సినిమాను 73 థియేటర్లు, లొకేషన్లలో మిస్టర్ ఫర్‌ఫెక్ట్ ఆమీర్‌ఖాన్‌ చిత్రం ‘దంగల్‌' 69 థియేటర్లలో విడుదల చేశారు. అయితే ఆ రికార్డులను అన్నింటినీ ‘అజ్ఞాతవాసి’ విడుదల కాకుండానే బ్రేక్ చేస్తుందనేది హాట్ టాపిగ్గా మారింది. ఈ సినిమాలో ఏడు భారీ ఫైట్స్ తో పవన్ ను మెస్మరైజ్ చేసిన డైరక్టర్ త్రివిక్రమ్ బ్లాక్ బ్లాస్టర్ హిట్ ఇవ్వాలని కసితో వర్క్ చేసినట్లు సినీ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. అంతేకాదు త్రివిక్రమ్ ‘అతడు’ సినిమా రేంజ్ కి మించిన ఫైట్స్ ‘అజ్ఞాతవాసి’ లో దర్శనమిస్తాయని అంటున్నారు. ఈ యాక్షన్ సీన్స్ కోసం భారీ బడ్జెట్ ఖర్చు పెట్టడమే కాకుండా ఈసీన్స్ విషయంలో వచ్చే గ్రాఫిక్స్ క్వాలిటీ చాల అద్భుతంగా ఉంటుంది అని వార్తలు వస్తున్నాయి

Show Full Article
Print Article
Next Story
More Stories