టవరెక్కిన బామ్మ

Submitted by arun on Tue, 01/09/2018 - 16:38

రాజమహేంద్రవరంలో ఓ బామ్మ టవరెక్కి నిరసన వ్యక్తం చేస్తోంది. ఇందిరా సత్యనగర్ వాసుల ఇళ్లను కార్పొరేషన్ అధికారులు కూల్చడం కోసం నోటీసులు ఇచ్చారని. కూల్చివేతలు ఆపడం కోసం 30 రోజులుగా దీక్షలు చేస్తున్నాఅధికారులు స్పందించకపోవడంతో కుమరమ్మ టవరెక్కి నిరసన వ్యక్తం చేస్తోంది. ఎంతమంది నచ్చచెప్పినా వినిపించుకోకుండా ఆమె టవర్ పైనే ఉంది. ప్రభుత్వం తమ ఇళ్లను కూల్చివేయనని చెప్పాలని ఆమె డిమాండ్ చేస్తోంది.

దాదాపు నెల రోజుల నుంచి దీక్ష చేస్తున్నా ఇందిరా సత్యనగర్ వాసుల ఆవేదనను ఎవరూ పట్టించుకోలేదని మాజీ ఎంపీ హర్ష కుమార్ అన్నారు 50 సంవత్సరాలుగా ఇందిరా సత్యానగర్‌లో ప్రజలు నివసిస్తున్నారని ఈ ప్రాంతంలో 80 అడుగుల రోడ్డు అవసరం లేదని తెలిపారు ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తోందన్నారు ప్రభుత్వం వెంటనే స్పందించి కుమరమ్మను సెల్ టవర్ నుంచి కిందకు దించాలని కోరారు.

English Title
Old Woman Climbs Tower Against Demolition Of Houses

MORE FROM AUTHOR

RELATED ARTICLES