పాపం.. వెంకన్న కష్టాలు తీరేదెలా?

Submitted by lakshman on Thu, 03/15/2018 - 22:16
old notes demonetization

తిరుమల వెంకటేశ్వరస్వామిని కూడా.. మోడీ ప్రభుత్వం ముప్పుతిప్పలు పెట్టింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత.. స్వామి వారి హుండీలో అనూహ్యంగా రద్దయిన నోట్ల ప్రవాహం కట్టలు తెంచుకుని మరీ వచ్చి పడింది. ఇది.. భారీ మొత్తంలో ఉండొచ్చని కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అధికారిక లెక్కలు ఇంకా బయటికి రాకపోయినా.. పెద్ద నోట్ల రద్దు తర్వాత వచ్చిన పాత నోట్ల ముడుపులన్నీ.. ఆలయ అధికారులు భద్రంగా దాచి పెట్టారు.

ఇప్పటికే.. వాటిని మార్చుకునేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్రాన్ని.. రిజర్వ్ బ్యాంకును కోరినా కూడా.. ఏ మాత్రం స్పందన లేదు. కొన్నిసార్లు.. ఆ అవకాశం లేదన్న సంకేతాలు ఇచ్చారు తప్ప.. స్పష్టమైన అవకాశాన్ని మాత్రం టీటీడీ.. ఆ నోట్లను మార్చుకునేందుకు అందుకోలేకపోయింది. దీంతో.. టీటీడీ నిర్వహణ పరంగా.. ఎంతో కీలకమైన భక్తుల ముడుపులు.. ఇలా భారీ మొత్తంలో వృథాగా పడి ఉండడం.. ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది.

వచ్చిన డబ్బును ఏం చేయాలి? ఎక్కడ పెట్టాలి? అసలు కేంద్రం ఈ విషయంలో ఎలా స్పందిస్తుంది? అన్న విషయాలు అర్థం కాక.. అధికారులు ఆపసోపాలు పడుతున్నారట. అందుకే.. మరోసారి ఆర్బీఐకి లేఖ రాసిన సిబ్బంది.. భక్తుల మనోభావాలు గౌరవించి.. ఆ డబ్బును ఇప్పుడు చలామణిలో ఉన్న నగదుతో మార్చుకునేందుకు అనుమతివ్వాలని కోరుతున్నారట.

English Title
old notes demonetization effects on lord balaji

MORE FROM AUTHOR

RELATED ARTICLES