కట్టెలు దొంగలించిందంటూ బాలికను చితక్కొటిన దుర్మార్గులు

Submitted by arun on Wed, 01/10/2018 - 12:24
Odisha

ఒడిశాలోని బాలాషోర్‌లో జరిగిన దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కట్టెలు దొంగతనం చేసిందన్న నెపంతో మానిసిక స్థితి బాగలేని బాలికపై ప్రతాపం చూపించారు. బాలికను లాగి లాగి కింద పడేసి కొట్టారు. అంతటితో ఆగని దుర్మార్గులు అమ్మాయిని తాళ్లతో కట్టేసి ఈడ్చుకువెళ్లారు. వదిలేయాలని వేడుకున్నా పట్టించుకోకుండా చేతులు కట్టేసి లాక్కెళ్లారు. ఎక్కడ పడితే అక్కడ కొట్టారు. కొట్టవద్దని  కొందరు అడ్డు పడిన వదిలిపెట్టలేదు. దాడి విషయం పోలీసులకు తెలియడంతో కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. 

English Title
Odisha: Mentally challenged girl tied, beaten

MORE FROM AUTHOR

RELATED ARTICLES