దసరా కానుకగా 'అరవింద సమేత వీరరాఘవ'

దసరా కానుకగా అరవింద సమేత వీరరాఘవ
x
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'అరవింద సమేత వీరరాఘవ' రీసెంట్ గా విడుదల అయిన ఈ సినిమా పాటలకు...

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'అరవింద సమేత వీరరాఘవ' రీసెంట్ గా విడుదల అయిన ఈ సినిమా పాటలకు అభిమానుల నుంచి ఆధిభితమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం మిగిలిన రెండు పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ విదేశాల్లో ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా పూర్తికాబోతుంది. ఇదిలావుంటే ఈ సినిమా రిలీజ్ డేట్‌ని ప్రకటించారు దర్శక నిర్మాతలు. అక్టోబర్ 11న దసరా కానుకగా విడుదల చేస్తున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. దీనికి సంబంధించిన పోస్టర్స్‌ని కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. కాగా ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా.. ఇందులో జగపతిబాబు, ఈషా రెబ్బా, నాగబాబు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. అక్టోబర్‌ 10న రిలీజ్‌ కానున్న ఈ చిత్రానికి సంగీతం: యస్‌.యస్‌. తమన్, కెమెరా: పీయస్‌ వినోద్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories