త్వరలో మరో బాహుబలి

Submitted by nanireddy on Fri, 08/03/2018 - 08:07
now-a-prequel-to-baahubali-on-netflix

తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న సినిమా 'బాహుబలి'.. రెండు పార్టులు గా వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యి ప్రేక్షకులను మైమరిపించింది. 
భారతీయ సినిమాను గర్వించదగ్గ స్థానంలో నిలబెట్టింది. తాజాగా ఈ మూవీకి ప్రీక్వెల్ వస్తోంది. కాకపోతే సినిమా రూపంలో కాదు. వెబ్ సిరీస్ గా రాబోతోంది. అయితే దీనిని ప్రముఖ ఆన్ లైన్ మూవీ మేకింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్, బాహుబలి టీమ్ తో కలిసి నిర్మిస్తోంది. బాహుబలి సామ్రాజ్యం స్థాపించడానికి ముందు ఏం జరిగింది శివగామి రాజమాతగా ఎలా అవతరించింది అనే కథతో మొదటి సీజన్ లో 9 ఎపిసోడ్లుగా ఇది రూపొందనుంది. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ఆఫీషియల్ వార్త బయటికి వచ్చింది. ప్రముఖ రైటర్ ఆనంద్ నీలకంఠన్ రాసిన ‘రైజ్ అఫ్ శివగామి’ బుక్ ఆధారంగా ఈ ఫ్రీక్వెల్ తెరకెక్కుతుంది. బాహుబలిని నిర్మించిన రాజమౌళి నిర్మాతలుగా వ్యవహరించిన ఆర్కామీడియా కూడా ఇందులో పాలుపంచుకుంటోంది. ఈ సిరీస్ కు దర్శకులు దేవా కట్టా, ప్రవీణ్ సత్తారు దర్శకత్వ బాధ్యతలు చేపడుతున్నారు. దీనికి 'శివగామి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ప్రస్తుతం ఈ సిరీస్ కోసం నటీనటుల ఎంపిక జరుగుతోంది. 

English Title
now-a-prequel-to-baahubali-on-netflix

MORE FROM AUTHOR

RELATED ARTICLES