ప్రఖ్యాత రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి ఇకలేరు!

ప్రఖ్యాత రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి ఇకలేరు!
x
Highlights

ప్రఖ్యాత తెలుగు రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి(79) ఇకలేరు. ఆదివారం తెల్లవారుజామున నిద్రలోనే ఆమె కన్నుమూశారు. దశాబ్దానికిపైగా అమెరికాలోని తన కూతురు...

ప్రఖ్యాత తెలుగు రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి(79) ఇకలేరు. ఆదివారం తెల్లవారుజామున నిద్రలోనే ఆమె కన్నుమూశారు. దశాబ్దానికిపైగా అమెరికాలోని తన కూతురు వద్ద ఉంటోంది సులోచనారాణి ఈ క్రమంలో ఆదివారం హఠాన్మరణం చెందారు. ఆమె మృతికి పలువురు రచయితలు నివాళులు అర్పించారు. కాగా ఆమె మృతిని ప్రముఖ ప్రింటింగ్ ప్రెస్ అధినేత ఎమెస్కో విజయ్‌ కుమార్‌ దృవీకరించారు. సింహభాగం సులోచనారాణి రచనలు ఎమెస్కో లోనే ప్రచురించినట్టు ఈ సందర్బంగా తెలిపారు. ఆమె అంత్యక్రియలు అమెరికాలోనే నిర్వహించనునంట్టు సులోచనారాణి కూతురు వెల్లడించింది. 1940లో కృష్ణా జిల్లా మొవ్వ మండలములోని కాజ గ్రామములో జన్మించింది సులోచనారాణి. ఆమె రాసిన నవలలు ముఖ్యంగా.. ఆగమనం , అమృతధార , ఋతువులు నవ్వాయి , కలలకౌగిలి వంటివి బాగా ప్రాచుర్యం పొందాయి.. జీవన తరంగాలు ,సెక్రటరీ ,రాధాకృష్ణ , అగ్నిపూలు ,చండీప్రియ వంటి నవలను ఆధారంగా చేసుకొని సినిమాలు నిర్మించారు. అంతేకాకుండా టెలివిజన్ రంగంలోసూపర్ హిట్ అయినా రాధా మధు సీరియల్ ఆమె రచించిన నవలే కావడం విశేషం.

Show Full Article
Print Article
Next Story
More Stories