కొలిక్కిరాని కూటమి లెక్కలు...

Submitted by chandram on Fri, 11/09/2018 - 19:33

రోజుల తరబడి సమీక్షలు, చర్చలు, వరుసగా సమావేశాలు, మంతనాలు అయినా మహాకూటమి లెక్కలు కొలిక్కిరాలేదు. కాంగ్రెస్ కు తమ సీట్లపై క్లారిటీ వచ్చినా భాగస్వామ్య పార్టీలకు సీట్ల కేటాయింపుపై మాత్రం స్పష్టత రాలేదు. దీంతో ముందు తమ లెక్కతేల్చాలని తెగేసి చెబుతోంది సీపీఐ. మహాకూటమిలో సీట్ల సర్ధుబాటుపై ఇంకా క్లారిటీ రాలేదు. కాంగ్రెస్ తొలి జాబితా విడుదలకు సిద్ధమైన నేపధ్యంలో తమకు సీట్ల కేటాయింపుపై స్పష్టత ఇవ్వలేదని భాగస్వామ్య పక్షాలు అంటున్నాయి. ఎన్నికలు సమీపించడంతో సీట్లతో పాటు తమకు కేటాయించే స్థానాలపై కూడా క్లారిటీ ఇవ్వాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. కూటమిలో భాగంగా తమకు మూడు సీట్ల కేటాయించడంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మండిపడుతున్నారు. జానారెడ్డి, కోదండరాం, ఎల్.రమణలతో భేటీలో తమకు కేటాయించాల్సిన సీట్లపై చర్చించారు. కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా సీట్ల ప్రకటన చేసిందని చాడ వెంకటరెడ్డి ఆరోపించారు. తాము ఐదు సీట్లే అడిగినా, కాంగ్రెస్ క్లారిటీ ఇవ్వడం లేదన్నారు. పొత్తుల ధర్మం ప్రకారం, సీపీఐకి గౌరవప్రదమైన సీట్లు కేటాయించాలని చాడ వెంకటరెడ్డి జానారెడ్డికి తెలిపారు. సీట్ల సర్ధుబాటు ప్రక్రియ పూర్తికాకపోవడంతోనే సమస్యలు వస్తున్నాయని కోదండరాం ఆరోపించారు. టీజేఎస్ కు 8 సీట్లపై ఇంకా క్లారిటీ రాలేదని చెప్పారు. సీపీఐ కోరుతున్న సీట్లను ఇచ్చి మహాకూటమి ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కాంగ్రెస్ దే అని కోదండరాం అన్నారు. మరోవైపు, పొత్తుల వ్యవహారం ఇంకా పూర్తి కాలేదని, కూటమి పార్టీలు అడిగిన సీట్లును కేటాయిస్తామని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి తెలిపారు. దేశ అవసరాల దృష్ట్యా టీడీపీ, కాంగ్రెస్ కలిసి పనిచేస్తున్నాయని పొత్తుల అంశంపై చంద్రబాబే ఢిల్లీ వెళ్లి రాహుల్‌ని కలిశారని జానారెడ్డి తెలిపారు. బీసీలకు అన్యాయం జరగదని గతంలో ఇచ్చినట్లే సీట్లు కేటాయించామని జానారెడ్డి స్పష్టం చేశారు. మహాకూటమిలో సీట్ల సర్ధుబాటుపై భాగస్వామ్య పార్టీల నుంచి కాంగ్రెస్ పై ఒత్తిడి పెరుగుతోంది. దీంతో వీలైనంత త్వరగా సీట్ల పంపకాలతో పాటు స్థానాల కేటాయింపుపై క్లారిటీ ఇచ్చేందుకు హస్తం పార్టీ కసరత్తు చేస్తోంది.

English Title
not get clarity about mahakutami seats

MORE FROM AUTHOR

RELATED ARTICLES