ఇంట్లో మరుగుదొడ్డి లేదని.. బడి మానేసి..!

ఇంట్లో మరుగుదొడ్డి లేదని.. బడి మానేసి..!
x
Highlights

మరుగుదొడ్డి కట్టిస్తేనే వివాహం చేసుకుంటానని టీవీ ప్రకటనలో చూశాం టాయిలెట్ కట్టిస్తేనే కాపురానికి వస్తా అంటూ పుట్టింటికి వెళ్లిపోయిన యువతుల గురించి...

మరుగుదొడ్డి కట్టిస్తేనే వివాహం చేసుకుంటానని టీవీ ప్రకటనలో చూశాం టాయిలెట్ కట్టిస్తేనే కాపురానికి వస్తా అంటూ పుట్టింటికి వెళ్లిపోయిన యువతుల గురించి విన్నాం ఆత్మాభిమానం కోసం ఆ యువతులు తెగువ చూసి స్ఫూర్తి పొందిందేమో తెలియదు కానీ ఓ బాలిక ఇంట్లో మరుగుదొడ్డి కట్టించమని బీష్మించుకొని కూర్చొంది పట్టిన పట్టు విడవ కుండా అనుకున్నది సాధించుకుంది.. ఇంతకీ ఎవరా విద్యార్థిని..? అనే కదా మీ ఆలోచన అది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

దేశంలో టాయ్‌లెట్ లేని ఇళ్ళ సంఖ్య కొన్ని కోట్లలో వుంటుందని సర్వేలు చెబుతున్నాయి. ప్రతి ఇంట్లో టాయ్‌లెట్ వుండటం అనేది ఆరోగ్యపరంగా మేలు చేసే అంశం మాత్రమే కాదు మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఆత్మకూర్ మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన 10వ తరగతి విద్యార్థిని భవాని కూడా ఇలానే ఫీల్ అయ్యింది ఇంట్లో టాయిలెట్ కట్టించమని తల్లిదండ్రుల మీద యుద్ధం ప్రకటించింది. ఇంట్లో మరుగుదొడ్డి నిర్మిస్తే గానీ పాఠశాలకు వెళ్లనని పట్టుపట్టింది.

మహిళల ఆత్మగౌరవం కాపాడాలనే ఆలోచనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా మరుగుదొడ్ల నిర్మాణాలు చేస్తున్నాయి అయితే భవాని తల్లిదండ్రులు మాత్ర మరుగుదొడ్డి కట్టించుకోలేదు మరుగుదొడ్డి కట్టించమని పలుమార్లు భవాని కోరినా ఆసక్తి చూపించలేదు. దీంతో మరుగుదొడ్డి నిర్మిస్తే కాని చదువుకోడానికి వెళ్లనని భవాని బీష్మించుకు కూర్చుంది మూడు రోజుల పాటు స్కూలుకి వెళ్లడం మానేసి ఇంట్లోనే కూర్చొని నిరసన వ్యక్తం చేసింది కూతురు ఇబ్బందిని గమనించిన తండ్రి మరుగుదొడ్డి నిర్మించాడు.

ఈ వ్యవహారం కలెక్టర్ శ్వేతమహంతికి తెలియడంతో భవానిని పిలిచి అభినందించారు ఆమెకు దుస్తులు, సైకిల్ బహుమతిగా ఇచ్చారు మొత్తానికి తల్లిదండ్రులతో పోట్లాడి టాయిలెట్ నిర్మించుకున్న భవాని ప్రస్తుతం తోటి విద్యార్థులకు, గ్రామస్థులకు ఆదర్శంగా నిలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories