‘జనసేన’కు పోలీసుల షాక్.. కవాతుకు అనుమతి నిరాకరణ!

Submitted by arun on Mon, 10/15/2018 - 13:19

రాజమండ్రిలో భారీ కవాతు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న జనసేన నేతల ఆశలపై పోలీసులు నీళ్లుజల్లారు.  బ్యారేజీ పిట్టగోడలు బలహీనంగా ఉన్న కారణంగా అనుమతి నిరాకరిస్తున్నట్టు రాజమండ్రి అర్బన్ పోలీసులు ప్రకటించారు. పదివేలకు మించి వస్తే ప్రమాదం తప్పదంటూ హెచ్చరించిన ఉన్నతాధికారులు అనుమతి నిరాకరిస్తూ జనసేన నేతలకు నోటీసులు జారీ చేశారు.  మరోచోట కవాతు నిర్వహించుకుంటే తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ స్పష్టం చేశారు. అయితే ముందుగా అనుమతినిచ్చి తరువాత ఎలా రద్దు చేస్తారంటూ కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకే అనుమతి నిరాకరించారంటూ ఆరోపణలు గుప్పించారు.  
 

English Title
no permission for Janasena Kavathu

MORE FROM AUTHOR

RELATED ARTICLES