అక్కినేని ఫ్యామిలీని వెంటాడుతోన్న గండం

Submitted by arun on Fri, 01/12/2018 - 15:06
Akkineni Family

ఒక్క హీరోకు ఫ్లాప్ పడితే ఏమో అనుకోవచ్చు. కానీ గుండుగుత్తగా అక్కినేని ఫ్యామిలీ ఫ్యామిలీయే ఫ్లాప్ ల్లో ఇరుక్కుంది. ఒక్క హిట్ కోసం తండ్రి నాగార్జున నుంచి తనయులు చైతు,అఖిల్ వరకు అల్లాడుతున్నారు. ఒక్క చైతు పెళ్లి మ్యాటర్ తప్పించి..పోయిన ఏడాది అక్కినేని ఫ్యామిలీలోని ఏ హీరోకు కలిసి రాలేదు.

అక్కినేని ఫ్యామిలీ హీరోలు నాగార్జున, చైతూ, అఖిల్ ను దురద్రుష్ట్యం వెంటాడుతోంది. ఒక్కరికి హిట్ ఒకరికి ఫ్లాప్ అని కాకుండా ఈ హీరోలంతా ఫ్లాప్ లతో సతమతమవుతున్నారు. దీంతో ఇటు అక్కినేని హీరోలు, అటు ఫ్యాన్స్ లో నిరాశ నిండుకుంది.

సోగ్గాడే చిన్న నాయన, ఊపిరి సినిమాలతో మంచి ఊపు మీద కనిపించిన నాగార్జునను మళ్లీ ఫ్లాప్ వెక్కిరించాయి. నిర్మాల కాన్వెంట్ మొదలుకొని..ఓం నమో వెంకటేశాయ, రాజుగారిగది 3 వరుసగా మూడు ఫ్లాప్ లు చవి చూశాడు. అక్కినేని ఫ్యామిలీకి పెద్ద దిక్కుగా ఉన్న నాగ్ కూడా ఫ్లాప్ ల్లో ఉండడం..ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేస్తోంది. ఇప్పుడు నాగార్జున ఆశలు, అంచనాలన్నీ వర్మ మూవీపైనే పెట్టుకున్నాడు. ఈసినిమాతోనైనా గట్టెక్కాలని చూస్తున్నాడు.

అక్కినేని మొదటి వారసుడు నాగ చైతన్య కూడా ప్లాప్ లో చిక్కుకున్నాడు..ప్రేమమ్ హిట్ తో గాడిలో పడ్డాడనుకునేలోపే మళ్లీ వరుసగా మూడు ఫ్లాప్ చవిచూశాడు. రారండోయ్ వేడుక చూద్దాం యావరేజ్ గా నిలిచినా..సాహసమే శ్వాసగా సాగిపో, యుద్దం శరణం సినిమాలు నిరాశనే మిగిల్చాయి. ఐతే పోయిన ఏడాది చైతుకు చెప్పుకోవాల్సిన స్వీట్ మెమోరి ఎంటంటే అది పెళ్లినే. సమంత పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కు ఓ ట్రీట్ ఇచ్చాడు అంతే. ప్రస్తుతం చైతు కాస్త స్పీడ్ పెంచి రెండు సినిమాలు చేస్తున్నాడు.

English Title
no movie hits for akkineni family

MORE FROM AUTHOR

RELATED ARTICLES