రాజశేఖర్‌‌ విషయంలో వస్తున్న రూమర్స్‌పై తారా చౌదరి క్లారిటీ

Submitted by arun on Fri, 08/10/2018 - 10:29
tara

తారా చౌదరి పేరు అందరికీ గుర్తుండే ఉంటుంది. అప్పట్లో ఆమె వార్తల్లో వ్యక్తిగా మారింది. సెక్స్ స్కామ్ విషయంలో ఆమెపై వివాదం చెలరేగింది. ఆ సమయంలోనే హీరో రాజశేఖర్ కు, ఆమెకు మధ్య లింక్ పెడుతూ ఊహాగానాలు ప్రచారమయ్యాయి. ఆ రూమర్స్ పై తారా చౌదరి తాజాగా వివరణ ఇచ్చింది. హీరో రాజశేఖర్ అంటే నాకు ఎంతో అభిమానం. నేను సినీ ఇండస్ట్రీకి రాక మునుపు ‘మా అన్నయ్య’ అనే సినిమా చూశాను. ఆ సినిమా చాలా బాగా నచ్చింది. అన్నయ్య సెంటిమెంట్ నచ్చింది. తమ్ముడిని ఎలా చూస్కోవాలి అనే సీన్లు నాకు బాగా నచ్చాయి. నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత సినిమా షూటింగ్ టైంలో రాజశేఖర్‌ను కలిసి మీరంటే నాకు అభిమానమని.. మీరు నటించిన ‘మా అన్నయ్య’ అనే సినిమా బాగా నచ్చిందని చెప్పాను ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఆ తర్వాత నేను హైదరాబాద్‌లోని శ్రీనగర్ కాలనీలో నేనుండే ఫ్లాట్ పక్కన ఓ ఫ్లాట్ ఖాళీగా ఉంటే చూసేందుకు రాజశేఖర్, జీవిత ఇద్దరూ వచ్చి చూశారు. అలా కొన్ని సందర్భాల్లో ముఖ పరిచయం తప్పితే ఇంకోటేమీ లేదు. రాజశేఖర్ పై వస్తున్న రూమర్స్ అన్నీ అబద్ధాలే.
 
ఆయన చాలా మంచి మనిషి. రాజశేఖర్, జీవిత ఇద్దరూ వ్యక్తిగతంగా చాలా గుడ్ పర్సన్స్. బయట ఏవేవో రూమర్స్ వస్తున్నాయి.. అవన్నీ వాస్తవాలనీ నేను అనుకోవట్లేదు. నేను వాళ్లకు ఎదురుపడ్డప్పుడు.. వాళ్లు నాకు ఎదురుపడినప్పుడు మాట్లాడుకుంటాం అంతే. ఓ షూటింగ్ సమయంలో రాజశేఖర్, జీవితతో కలిసి నేను సెల్ఫీ కూడా దిగాను. దాన్ని చూసి నన్ను రకరకాలుగా బ్లేమ్ చేశారు. అంతే అంతకుమించి ఏమీ లేదు" అని తారా చౌదరి క్లారిటీ ఇచ్చింది.

English Title
No links with Rajasekhar, says tara chowdary

MORE FROM AUTHOR

RELATED ARTICLES