బ్యాగులో 54 నరికిన చేతులు

Submitted by arun on Sat, 03/10/2018 - 15:36
hands

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 54 చేతులు నది ఒడ్డున లభించడంతో ప్రపంచమంతా కలవరానికి గురిచేస్తోంది. ఇది తీవ్రవాదులు చేశారా? వైద్య సంస్థలు చేశాయా?  ఏమైనా పూజలా లేక శిక్షలా?  అని తేల్చే పనిలో రష్యన్‌ పోలీసులు నిమగ్నమయ్యారు. ఫోరెన్సిక్‌ వారికీ అంతు చిక్కకుండా చేతుల వేలిముద్రలను చెరిపేశారు. రష్యాలోని అముర్‌ నది ఒడ్డున ఒక  సంచిలో మణికట్టు వరకు నరికేసిన మనుషుల అరచేతులు 54 కనిపించడం.. అక్కడి వారిని భయభ్రాంతులకు గురిచేసింది. పోలీసులు ఆ చేతులను స్వాధీనం చేసుకొని, ఫోరెన్సిక్‌ విభాగానికి తరలించారు. ఫోరెన్సిక్‌ నివేదిక ఆధారంగా ఈ మిస్టరీనీ ఛేదించడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఒక చేతి మీద మాత్రమే వేలిముద్రలు కన్పించాయని మిగతా వాటి వేలిముద్రల కోసం ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. అముర్‌ నదీ ప్రాంతం ఎప్పుడూ మంచుతో కప్పబడి ఉంటుంది. అందుకే చేతులు పూర్తిగా పాడవలేదని తెలుస్తోంది. మిస్టరీగా మారిన ఈ కేసులో దర్యాప్తును వేగవంతం చేసినట్లు పోలీసులు తెలిపారు.

English Title
'No Foul Play' After Bag Of Human Hands Found In Russian Far East

MORE FROM AUTHOR

RELATED ARTICLES