నాడు అన్నపూర్ణ ఖిల్లా... నేడు ఆర్తనాదాల జిల్లా... ఇందూరు ముఖచిత్రం

నాడు అన్నపూర్ణ ఖిల్లా... నేడు ఆర్తనాదాల జిల్లా... ఇందూరు ముఖచిత్రం
x
Highlights

నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ.. మహాకవి దాశరథి మనస్సును కదిలించిన ఉద్యమాల గడ్డ అది... తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన నేల అది. వ్యవసాయాధారిత జిల్లాగా.....

నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ.. మహాకవి దాశరథి మనస్సును కదిలించిన ఉద్యమాల గడ్డ అది... తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలూదిన నేల అది. వ్యవసాయాధారిత జిల్లాగా.. తెలంగాణకు అన్నపూర్ణగా విరాసిల్లిన ప్రాంతం.. ఆసియా ఖండంలోనే పేరొందిన నిజాం చక్కర కర్మాగారానికి పునాది ఇక్కడే. ఇంతటి ఘన చరిత్ర ఉన్న ఆ జిల్లా ఇప్పుడు పరిశ్రమలు లేని ఏకైక జిల్లాగా రికార్డు సాధించింది.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పునర్విభజన తర్వాత రెండు జిల్లాలుగా విడిపోయింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలుగా ఆవిర్భవించింది. నాలుగు నియోజకవర్గాలతో కామారెడ్డి జిల్లా విడిపోగా.. ఐదు నియోజకవర్గాలతో నిజామాబాద్ జిల్లా కొనసాగుతోంది. తెలంగాణలో హైదరాబాద్- వరంగల్ తరవాత మూడో అతిపెద్ద జిల్లాగా గుర్తింపు పొందింది. ఐదు నియోజకవర్గాలు కలిపి జిల్లా మొత్తం 15, 71,022 మంది జనాభా ఉండగా.. 7,68, 477 మంది పురుషులు 8, 02,545 మంది మహిళలు ఉన్నారు. నిజామాబాద్ సౌత్, నార్త్, రూరల్, మోపాల్, ముప్కాల్, మెండోరా, ఇందల్ వాయి, ఏర్గట్ల మండలాలు కొత్తగా ఏర్పడగా.. నిజామాబాద్ పోలీస్ కమిషరేట్ గా అప్ గ్రేడ్ అయ్యింది. ఆర్మూర్ రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు కాగా.. భీంగల్ మున్సిపాలిటీ హోదా పొందింది.

తెలంగాణకు అన్నపూర్ణగా విరాజిల్లుతున్న నిజామాబాద్ జిల్లాను అనేక సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. గల్ఫ్‌ వలసలు, నిజాం చక్కర కర్మాగారం, పసుపు బోర్డు, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు ఈ సారి ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ సమస్యల పరిష్కారం చూపే పార్టీలకు జిల్లా ఓటర్లు పట్టం కట్టే అవకాశం ఉంది. ఆ దిశలో పార్టీలు తమ మ్యానిఫెస్టోలో ఈ అంశాలను చేర్చాలని కోరుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories