ఎన్టీఆర్ బయోపిక్ కు దర్శకుడు ఆయనే?

Submitted by nanireddy on Wed, 05/02/2018 - 12:00
news about ntr biopic

దివంగత మహానటుడు ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారణగా రూపొందుతున్న 'ఎన్టీఆర్ బయోపిక్' నుంచి దర్శకుడు తేజ అనూహ్యంగా తప్పుకున్నాడు. ఈ ప్రాజెక్ట్ చేపట్టడం తన వల్ల కాదని మెగాఫోన్ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీంతో దర్శకుల వేట ప్రారంభించాడు చిత్ర నిర్మాత, నటుడు నందమూరి బాలకృష్ణ అందులో భాగంగా ప్రసిద్ధ దర్శకులు కే. రాఘవేందర్ రావు , జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) , కృష్ణవంశీ లను సంప్రదించాడు. అయితే ఎవరి ప్రాజెక్ట్ లో వారు బిజీగా ఉండటం చేత  'ఎన్టీఆర్ బయోపిక్' కోసం టైం స్పెండ్ చేయలేమని బాలయ్యకు చెప్పారట. దీంతో ఒకానొక దశలో బాలకృష్ణే ఈ సినిమాకు మెగాఫోన్ పట్టాలని ఫిక్స్ అయ్యాడు. కానీ  వేరే వాళ్ళకే సినిమా దర్శకత్వ  బాధ్యతలు అప్పజెప్పాలని బాలయ్య కుటుంబసభ్యులు కోరారు. దీంతో బాలయ్య మళ్ళీ దర్శకుల వేట ప్రారంభించాడు. గతంలో  సూపర్ హిట్ చిత్రం 'ఆ నలుగురు' తో మంచి గుర్తింపు తెచ్చుకున్న 'చంద్ర సిద్ధార్థ' పేరు తెరపైకి వచ్చింది. ఇప్పటికే సిద్ధార్థ ను సంప్రదించగా ఆయన కూడా ఒకే చెప్పినట్టు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Image removed.

English Title
news about ntr biopic

MORE FROM AUTHOR

RELATED ARTICLES