ఒకే ఇంట్లో 11 మంది చనిపోవడానికి వెనుక విస్తుపోయే రహస్యం..

Submitted by nanireddy on Mon, 07/02/2018 - 15:11
news about 11 dead bodies found in new delhi

 దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఒకే ఇంట్లో 11 మంది ఆత్మహత్యపై ఢిల్లీ పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. అయితే వారు ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హత్య చేశారా అన్న విషయంపై పోలీసులు ఎటూ తేల్చలేకపోతున్నారు. కానీ వాస్తవంగా బురారీ కుటుంబానికి విపరీతమైన భక్తి భావం ఉంది. దీనికితోడు మూఢవిశ్వాసాలను అపారంగా నమ్ముతారు. ఇందుకు కారణం గతంలో జరిగిన ఓ సంఘటనే అని తెలుస్తోంది. 

వృత్తిరీత్యా  బురారీ కుటుంబం కలప వ్యాపారం నిర్వహించేది. పదిహేనేళ్ల కిందట ఆ ఇంటి పెద్దకు ప్రమాదవశాత్తు చెక్క మీదపడటంతో ఆయన తన మాటను కోల్పోయాడు. అయితే కొద్దిరోజులకు ఎవరో చెబితే పూజలు చేశారు. దీంతో అతనికి తిరిగి మాట వచ్చిందని గతంలో ఆ ఇంట్లో పనిచేసిన మహిళ వెల్లడించింది. అలా వారి ఇంట్లో భక్తిభావం ఎక్కువైంది. ఈ క్రమంలోనే కొందరు మంత్రగాళ్లతో కలిసి తాంత్రికపూజలు చేసేవారు. పైగా పునర్జన్మలను బలంగా నమ్మేవారని స్థానికులు చెబుతున్నారు. 

ఆ కుటుంబానికి తాంత్రికపూజలు అలవాటు కావడంతో కొద్ది రోజులకే శృతిమించాయి. ఈ జన్మలో చనిపోతే వచ్చే జన్మలో  మళ్ళీ పుట్టడం తోపాటు  అపారమైన శక్తులు తమ సొంతమవుతాయని నమ్మేవారు. పైగా ఏళ్ల తరబడి పూజలు చేసినా భగవంతుడు తమ కుటుంబానికి మోక్షం సిద్ధించలేదన్న అసంతృప్తి కూడా ఉండేది. దీంతో చనిపోయి పునర్జన్మ పొందాలనే ఆలోచనను సృష్టించుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
 

English Title
news about 11 dead bodies found in new delhi

MORE FROM AUTHOR

RELATED ARTICLES