డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైన వారం రోజులకే మృతి

Submitted by arun on Fri, 10/05/2018 - 15:08
Bengaluru Deputy Mayor

బెంగళూరు డిప్యూటీ మేయర్ రమైల ఉమాశంకర్ శుక్రవారంనాడు గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె వయస్సు 44 సంవత్సరాలు. కర్ణాటక‌లోని కావేరిపుర కార్పొరేటర్‌గా కూడా ఆమె ఉన్నారు. గత సెప్టెంబర్ 28న ఆమె డిప్యూటీ మేయర్‌గా ఎన్నికయ్యారు. డిప్యూటీ మేయర్‌గా బాధ్యతలు తీసుకొని వారం రోజులు కూడా గడవకముందే గుండెపోటుతో ఆమె మృతి చెందారు. దీంతో ఆమె మృతిపై పలువురు రాజకీయ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఉమాశంకర్‌ మృతి పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి సంతాపం వ్యక్తంచేశారు. ఆమె నిబద్ధత కలిగిన సామాజిక కార్యకర్త అని, పార్టీ కోసం ఎంతో చేశారని అన్నారు. ఆమె మరణ వార్త తెలుసుకుని షాక్‌కు గురయ్యానని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘నిన్న కూడా ఆమె మెట్రో ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఆమె మరణం షాక్‌కు గురిచేసింది.’, ‘డిప్యూటీ మేయర్‌ రమీలా ఉమాశంకర్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం, అకస్మాత్తుగా 44ఏళ్ల వయసులో ఆమె చనిపోవడం చాలా బాధ కలిగిస్తోంది’ అని పలువురు ట్వీట్లు చేశారు.
 

English Title
Newly-Elected Bengaluru Deputy Mayor, 44, Dies Of Heart Attack

MORE FROM AUTHOR

RELATED ARTICLES