అప్పుడే కొత్త సంవ‌త్స‌రంలోకి అడుగుపెట్టిన దేశం ఏంటో తెలుసా

Submitted by arun on Sun, 12/31/2017 - 20:16

ఎక్క‌డ చూసిన న్యూఇయ‌ర్ సంద‌డి క‌నిపిస్తోంది.మ‌రి మ‌న‌కంటే ముందుగా కొన్నిదేశాలు నూత‌న సంవ‌త్స‌రానికి ఆహ్వానం ప‌లుకుతున్నాయి. 
 భార‌త్ మ‌రికొన్ని గంట‌ల్లో కొత్త సంవ‌త్స‌రంలోకి అడుగు పెట్ట‌బోతుంటే న్యూజిలాండ్ వాసుల మాత్రం న్యూఇయ‌ర్ ఎంట్రీతో అద‌ర‌గొడుతున్నారు. న్యూజిలాండ్ రాజధాని ఆక్లాండ్ స్కైట‌వ‌ర్ వ‌ద్ద న్యూఇయ‌ర్ వేడుక‌ల్ని ఆదేశ ప్ర‌జ‌లు ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. 2017 వీడ్కోలు చెబుతూ 2018ఆహ్వానం ప‌లుకుతూ బాణా సంచాకాలుస్తూ నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికారు. ఇక న్యూజిలాండ్ త‌రువాత ఆస్ట్రేలియా న్యూఇయ‌ర్ కు స్వాగ‌తం పలికేందుకు సిద్ధ‌మైంది. ఆస్ట్రేలియా ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతమైన సిడ్నీలో కొత్త సంవ‌త్స‌రాన్ని ఆహ్వానించేందుకు అక్క‌డి ప్ర‌జ‌లు గుమిగూడారు. బాణా సంచా వెలుగులో న్యూఇయ‌ర్ ను ఆహ్వానించేందుకు ఎదురు చూస్తున్నారు. ఇక ఆస్ట్రేలియా తర్వాత గంటల వ్యవధిలోనే జపాన్‌, బీజింగ్‌, హాంకాంగ్‌, యూఈఏ, పారిస్‌, రోమ్‌, బ్రసెల్స్‌, లండన్‌, అమెరికాలోని న్యూయార్క్‌, లాస్‌ఏంజెల్స్‌లో న్యూ ఇయర్‌ వేడుకలు జరగనున్నాయి.

English Title
New Year celebrations LIVE UPDATES

MORE FROM AUTHOR

RELATED ARTICLES