జూన్ 2 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం: సీఎం

Submitted by santosh on Thu, 05/10/2018 - 14:33
new registration policy from june 2nd

జూన్ 2 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విధానం అమలు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులు పోను మిగతా 430 మండలాల్లో ఎమ్మార్వోలే రిజిస్ట్రేషన్ చేస్తారని సీఎం తెలిపారు. పోస్టులోనే రిజిస్ట్రేషన్ కాగితాలు, పాస్‌బుక్కులు ఇంటికొస్తయన్నారు. నీటి తీరువా బకాయిలు రద్దు చేసినమని, కనివినీ ఎరగని రీతిలో భూరికార్డుల ప్రక్షాళన చేసినమని అన్నారు. 58 లక్షల మంది రైతులకు పాస్‌బుక్కులు, పంట పెట్టుబడి సాయం అందిస్తున్నం. ప్రతీ 5 వేల ఎకరాలకు ఒక ఏఈవోను నియమించామని సీఎం తెలిపారు. వ్యవసాయం పండగ అని తెలంగాణ చేసి చూపెట్టాలని రైతులకు సూచించారు. 60 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ మనల్ని గోసపెట్టింది. తెలంగాణ సాధించిన పార్టీ టీఆర్‌ఎస్..తెలంగాణను వేధించిన పార్టీ కాంగ్రెస్ అని సీఎం ఆరోపించారు.

English Title
new registration policy from june 2nd

MORE FROM AUTHOR

RELATED ARTICLES